నేచురల్ ఫేస్ క్లెన్సర్, మాయిశ్చరైజర్, స్కిన్ టోన్‌గా పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎలాంటి చర్మ సమస్యకైనా పాలను పరిష్కారంగా ఉపయోగించవచ్చు. చర్మంపై ఉన్న మురికి, టాన్ తొలగించడానికి.. పాలలో దూదిని ముంచి ముఖం, మెడ, చేతులపై అప్లై చేయాలి. ఈ విధంగా 8 నిమిషాల పాటు రుద్దడం వల్ల చర్మపై టాన్, మురికి తొలగిపోతుంది.