- Telugu News Photo Gallery Arthritis Pain Relief Tips: Arthritis pain can control by turmeric and ginger
Arthritis Pain Relief Tips: ఆర్థరైటిస్ నొప్పులకు తక్షణ ఉపశమనం కావాలంటే.. నీళ్లలో దీన్ని చిటికెడు కలిపి తాగితే
కొన్నిసార్లు పాదాలు, వేళ్లు ఉబ్బి, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆర్థరైటిస్ నొప్పి కావచ్చు. గతంలో కీళ్లనొప్పులు ఎక్కువగా వృద్ధులకే వచ్చేవి. అయితే ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యకు గురవుతున్నారు. సకాలంలో ఈ సమస్యకు చికిత్సీ తీసుకోకపోతే తీవ్రతరం కావచ్చు..
Updated on: Aug 01, 2024 | 8:15 PM

కొన్నిసార్లు పాదాలు, వేళ్లు ఉబ్బి, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆర్థరైటిస్ నొప్పి కావచ్చు. గతంలో కీళ్లనొప్పులు ఎక్కువగా వృద్ధులకే వచ్చేవి. అయితే ప్రస్తుతం యువత కూడా ఈ సమస్యకు గురవుతున్నారు. సకాలంలో ఈ సమస్యకు చికిత్సీ తీసుకోకపోతే తీవ్రతరం కావచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు ఆర్థరైటిస్ నొప్పి తలెత్తుతుంది. కాబట్టి శరీర pH స్థాయిని సమతుల్యం చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆల్కలీన్ ఫుడ్స్ ను డైట్ లో ఉంచుకోవాలి. శరీరంలో యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు, ఆల్కలీన్ స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా క్షీణిస్తుంది. వివిధ శారీరక సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఆల్కలీన్ అధికంగా ఉండే పండ్లను ఆహారంలో ఉంచుకోవాలి.

ఆర్థరైటిస్ సమస్యలకు ఆహారంలో యాపిల్స్, చెర్రీస్, పైనాపిల్స్, అవకాడోస్, అరటిపండ్లు, పైనాపిల్స్ వంటి వాటిని ఆహారంలో ఉంచుకోండి. ఇవి శరీరంలో pH బ్యాలెన్స్‌ని కాపాడతాయి. ఆర్ధరైటిస్ నొప్పి-వాపు నుంచి ఉపశమనం పొందడంలో పసుపు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌లో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

పసుపు కలిపిన నీరు కూడా తాగవచ్చు. ఆర్థరైటిస్ సమస్యలకు అల్లం కూడా బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కీళ్ల నొప్పులకు అల్లం టీ తీసుకోవడంతో పాటు, అల్లం గ్రైండ్ చేసి వాపు-నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అల్లం కీళ్లను సక్రియం చేస్తుంది.

ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. లైట్ జంపింగ్, వాకింగ్, రన్నింగ్ వంటికి నెమ్మదిగా చేయాలి. ఇవి కండరాలను బలపరుస్తాయి. ఈ రకమైన శారీరక శ్రమ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వీటిని చేసే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి.




