- Telugu News Photo Gallery Soyabean Health Benefits: Soyabean has protein vitamins, minerals it gives many health benefits to body
Soya Chunks: శాఖాహారుల్లో ప్రొటీన్ లోపం నివారణకు చక్కని మార్గం.. ఆహారంలో వీటిని తీసుకుంటే సరి!
బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? కొలెస్ట్రాల్, మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? కీళ్ల-కండరాల నొప్పిని వేధిస్తుందా? ఈ సమస్యలన్నీ ప్రోటీన్, విటమిన్ లోపం వల్ల రావచ్చు. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది జంతు ప్రోటీన్లు అంటే చేపలు, మాంసం, గుడ్లు తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారు శాఖాహారం మాత్రమే తింటుంటారు. వీరి శరీరంలో ప్రోటీన్, విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది..
Updated on: Aug 01, 2024 | 8:29 PM

బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుందా? కొలెస్ట్రాల్, మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? కీళ్ల-కండరాల నొప్పిని వేధిస్తుందా? ఈ సమస్యలన్నీ ప్రోటీన్, విటమిన్ లోపం వల్ల రావచ్చు. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చాలామంది జంతు ప్రోటీన్లు అంటే చేపలు, మాంసం, గుడ్లు తినేందుకు ఇష్టపడరు. ఇలాంటి వారు శాఖాహారం మాత్రమే తింటుంటారు. వీరి శరీరంలో ప్రోటీన్, విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది. కానీ శాఖాహారం తినడం ద్వారా కూడా ఈ లోపాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది.

జంతు ప్రోటీన్‌కు సోయాబీన్ ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, వివిధ ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందుకే సోయాబీన్స్‌ను సూపర్‌ఫుడ్ అని అంటారు. శాకాహారంలో సోయాబీన్స్‌ను చేర్చుకోవడం వల్ల అనేక శారీరక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం.. సోయాబీన్స్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

సోయాబీన్స్‌లో ప్రోటీన్, విటమిన్ బి, సి, కెతో పాటు కాల్షియం, మెగ్నీషియం, కాపర్, జింక్ అధికంగా ఉంటాయి. సోయాబీన్స్‌లో ఫోలిక్ యాసిడ్ తగినంత మొత్తంలో ఉంటుంది. అందుకే రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ తప్పనిసరిగా చేర్చుకోవాలి. విటమిన్-కె ప్రతి ఒక్కరి శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలో ఈ విటమిన్ లోపం వల్ల గాయాలైతే రక్తస్రావం ఆగదు. అంటే రక్తం గడ్డకట్టడానికి విటమిన్ కె అవసరం. కాబట్టి మీకు ఈ విటమిన్ లోపం ఉంటే, మీ రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ చేర్చుకోవాలి.

విటమిన్-సి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్-సి గాయాలను వేగంగా నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

సోయాబీన్స్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బలహీనత నుంచి కండరాల-కీళ్ల నొప్పులను నయం చేయడం వరకు ఎన్నో సమస్యలను నివారిస్తుంది. శాఖాహారం తీసుకునే వారు తప్పనిసరిగా సోయాబీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.




