- Telugu News Photo Gallery Anemia Prevention Tips: Effective Tips To Increase Your Hemoglobin Levels Naturally
Anemia: గోర్లు, చర్మం పాలిపోయినట్లు కనిపిస్తున్నాయా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే..
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు రక్తహీనత తలెత్తుతుంది. రక్తహీనత వల్ల ఆక్సిజన్ తగినంత మొత్తంలో శరీరంలోని అన్ని భాగాలకు చేరదు. దీంతో శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే, గోర్లు, చర్మం పాలిపోయినట్లు, అలసట, బలహీనత, తలనొప్పి, శరీరం బరువు తగ్గడం, చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం, శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి, హృదయ స్పందన పెరగడం..
Updated on: May 31, 2024 | 9:09 PM

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు రక్తహీనత తలెత్తుతుంది. రక్తహీనత వల్ల ఆక్సిజన్ తగినంత మొత్తంలో శరీరంలోని అన్ని భాగాలకు చేరదు. దీంతో శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే, గోర్లు, చర్మం పాలిపోయినట్లు, అలసట, బలహీనత, తలనొప్పి, శరీరం బరువు తగ్గడం, చేతులు, కాళ్ళు చల్లగా ఉండటం, శ్వాసకోశ సమస్యలు, నిద్రలేమి, హృదయ స్పందన పెరగడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి..

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినట్లయితే ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, చేపలు, చికెన్, పప్పులు, పచ్చి కూరగాయలు, గింజలు అధికంగా తినాలి. ఐరన్‌తోపాటు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యమైనవి. విటమిన్ సి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ప్రధానంగా ఐరన్‌ను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇందుకు సిట్రస్ పండ్లను తినవచ్చు.

హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే విటమిన్ B12 ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ పోషకం రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుడ్లు, పాల ఉత్పత్తులు, సముద్రపు ఆహారంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ద్రవం తక్కువగా ఉన్నప్పుడు, రక్త సాంద్రత తగ్గుతుంది. రక్తపోటు కూడా తగ్గుతుంది. డీహైడ్రేషన్ వల్ల రక్తహీనత సమస్య కూడా పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి, వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి పుష్కలంగా నీరు తాగాలి.

టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. పెద్ద మొత్తంలో టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండుద్రాక్ష రసాన్ని పానీయంగా తీసుకోండి. ఈ రసం తీసుకోవడం వల్ల రెండు వారాల్లో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

వ్యాయామం లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేరు. యోగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా, శరీరంలోని ప్రతి భాగానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది. ఇది శారీరక బలహీనతను కూడా నివారిస్తుంది.




