- Telugu News Photo Gallery Smoking Effect on Women's Health: Cigarette Smoking Worsen Effect On Women Health
Women Smoking: పాలిచ్చే తల్లులు సిగరెట్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? నిపుణుల హెచ్చరిక
ఆఫీసులో అధిక పని ఒత్తిడి లేదంటే వ్యక్తిగత జీవితంలో కల్లోలాలు ఏదైతేనేం.. కాస్త ఉపశమనం పొందేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మంది సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇది ఒత్తిడిని తగ్గిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే కానీ ధూమపానం ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు..
Updated on: May 31, 2024 | 8:15 PM

ఆఫీసులో అధిక పని ఒత్తిడి లేదంటే వ్యక్తిగత జీవితంలో కల్లోలాలు ఏదైతేనేం.. కాస్త ఉపశమనం పొందేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మంది సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇది ఒత్తిడిని తగ్గిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే కానీ ధూమపానం ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈరోజుల్లో పురుషులే కాదు స్త్రీలు కూడా పొగతాగడం అలవాటు చేసుకుంటున్నారు. మహిళల్లో పొగతాగే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో సిగరెట్ తాగే వారు నానాటికీ ఎక్కువవుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా సిగరెట్‌లోని నికోటిన్ అందరిక ఆరోగ్యానికి హానికరం. అయితే ధూమపానం వల్ల స్త్రీలకు అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అధిక ధూమపానం వివిధ అవయవాలలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

గర్భస్రావం అయ్యే అవకాశం మరింత ఎక్కువ. అతిగా ధూమపానం చేసే స్త్రీలు గర్భం దాల్చే సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్యంగా రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ సిగరెట్లు తాగే వారిలో సంతానలేమి ప్రమాదం ఎక్కువ. IVF ప్రక్రియ కూడా గర్భధారణ రేటును ప్రభావితం చేస్తుంది.

గర్భధారణ సమయంలో స్త్రీలు పొగతాగితే పిండం ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందవు. దీంతో ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడంలో ఇబ్బంది ఏర్పడుతోంది. గర్భస్రావం ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక ధూమపానం మహిళల్లో ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ధూమపానం వల్ల పీరియడ్స్ క్రాంప్స్ సమస్య పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీరియడ్స్ కూడా సక్రమంగా రావు.

క్రమం తప్పకుండా ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ పొగలోని కొన్ని రసాయనాలు గర్భాశయంలోకి ప్రవేశిస్తాయని, ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు మహిళల్లో మల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక ధూమపానం తల్లి పాలను కూడా ప్రభావితం చేస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్ రక్తంలోకి వెళ్లి తల్లి పాలలో కలుస్తుంది. కాబట్టి ప్రసవించిన తర్వాత బిడ్డకు పాలిచ్చే సమయంలో ధూమపానానికి దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు ధూమపానం చేస్తే కనీసం 90 నిమిషాల తర్వాత శిశువుకు తల్లిపాలు ఇవ్వాలి.




