- Telugu News Photo Gallery Amazing Health benefits of Clapping Therapy, check here is details in Telugu
Clapping Benefits: చప్పట్లు కొట్టినా ఆరోగ్యానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా..?
చప్పట్లు అనేవి సాధారణంగా ఎవరినైనా అభినందించేటప్పుడు లేదా మంచి విషయాలు చెబుతున్నప్పుడు కొడుతూ ఉంటారు. అలాగే ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా చప్పట్లు అనేవి కొడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు జోక్స్ వేసినప్పుడు, ఉత్సాహ పరచడానికి కూడా క్లాప్స్ అనేవి కొడతారు. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. ఏంటి షాక్ అవుతున్నారా.. ఇది నిజమే. 'లాఫింగ్ థెరపీ' మాదిరిగానే ఇప్పుడు 'క్లాపింగ్ థెరపీ' కూడా ఫేమస్ అయ్యింది. శరీరంలో ప్రతి అవయవం ఇతర శరీర..
Chinni Enni | Edited By: Janardhan Veluru
Updated on: Nov 25, 2023 | 11:28 AM

చప్పట్లు అనేవి సాధారణంగా ఎవరినైనా అభినందించేటప్పుడు లేదా మంచి విషయాలు చెబుతున్నప్పుడు కొడుతూ ఉంటారు. అలాగే ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా చప్పట్లు అనేవి కొడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు జోక్స్ వేసినప్పుడు, ఉత్సాహ పరచడానికి కూడా క్లాప్స్ అనేవి కొడతారు. ఇలా చప్పట్లు కొట్టడం వల్ల కూడా ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. ఏంటి షాక్ అవుతున్నారా.. ఇది నిజమే.

'లాఫింగ్ థెరపీ' మాదిరిగానే ఇప్పుడు 'క్లాపింగ్ థెరపీ' కూడా ఫేమస్ అయ్యింది. శరీరంలో ప్రతి అవయవం ఇతర శరీర భాగాలతో కూడా ముడి పడి ఉంటుంది. అరి చేతుల్లో ఉండే చిన్న నరాలను ఉత్తేజ పరిస్తే.. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. మరి చప్పట్లు కొట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఫేస్ చేసే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. కానీ క్లాప్స్ కొట్టడం వల్ల జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుందట. చప్పట్లు కొట్టేటప్పుడు ఆవాల నూనె, కొబ్బరి నూనె రెండింటినీ మిక్స్ చేసి.. చప్పట్లు కొట్టడం వల్ల జుట్టు రాలడం అనేది కంట్రోల్ అవుతుందని క్లాపింగ్ థెరపీలో వెల్లడించారు.

చప్పట్లు కొట్టడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందట. దీంతో సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలు క్రమం తప్పకుండా క్లాప్స్ కొట్టడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అనేవి పెరుగుతాయట.

చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి దూరం అవుతాయట. చప్పట్లు కొట్టడం ప్రారంభించగానే బ్రెయిన్ సాను కూల సంకేతాలు వెళ్తాయట.. దీంతో నిరాశను, ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.





























