- Telugu News Photo Gallery After All Why Are There Black Pearls In Mangalsutra The Reason Is Very Special Telugu News
మంగళసూత్రంలో నల్ల పూసలు ఎందుకు ధరిస్తారో తెలుసా..? కారణం చాలా ప్రత్యేకమైనది..!
వివాహానంతరం వధువు 16 అలంకారాలలో మంగళసూత్రం ఒకటి. మంగళసూత్రం లేకుండా ఏ వివాహమూ పూర్తికాదు. వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. ఆ తర్వాతే ఆ వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రం ప్రధానంగా బంగారం, నల్ల పూసలను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక దారంతో నేసినది. అయితే మంగళసూత్రంలో నల్ల పూసలనే ఎందుకు వాడతారో తెలుసా.
Updated on: Feb 02, 2024 | 8:53 PM

హిందూ మతంలో వివాహ సమయంలో అనేక ఆచారాలు నిర్వహిస్తారు. ఇందులో మంగళసూత్రాన్ని ధరించడం కూడా ఒక ఆచారం. హిందూ మతంలో మంగళసూత్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. మంగళసూత్రం లేకుండా వివాహం సంపూర్ణంగా పరిగణించబడదు. అలాగే, వివాహానంతరం వధువు 16 అలంకారాలలో మంగళసూత్రం ఒకటి. మంగళసూత్రం లేకుండా ఏ వివాహమూ పూర్తికాదు.

వివాహ ఆచారాల సమయంలో వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని కడతాడు. ఆ తర్వాతే ఆ వివాహం సంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రం ప్రధానంగా బంగారం, నల్ల పూసలను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేక దారంతో నేసినది. అయితే మంగళసూత్రంలో నల్ల పూసలనే ఎందుకు వాడతారో తెలుసా.

మన దేశంలో పాటించే ప్రతి సంప్రదాయం వెనుక కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు ముడిపడి ఉన్నాయి. పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా ఆలోచించి ఇలాంటి సిద్దాంతలను అమలు చేశారు. వీటిల్లో కొన్ని ఆచారాలు ఇప్పటికీ యధాతథంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటే మంగళసూత్రాన్ని పవిత్రంగా భావించడం. అందులో నల్లపూసలు మరింత పవిత్రమైనవిగా పరిగణిస్తారు.

బంగారు గొలుసుకు ఆ ప్రాంతపు నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాల ప్రాతిపదికన.. ఒకటి లేదా రెండు సూత్రాలను నల్లపూసలు, పగడాలు, ముత్యాలతో కలిపి కుచ్చుతారు. ఇది కొన్ని చోట్ల ఒకటే సూత్రంగా కూడా కనిపిస్తుంది. అయితే, వివాహిత స్త్రీలను, వైవాహిక జీవితాన్ని చెడు దృష్టి నుండి రక్షించడానికి నల్ల పూసలు రక్షణగా పనిచేస్తుందని నమ్ముతారు. మంగళ సూత్రంలో ఉండే నల్ల పూసల వల్ల స్త్రీ చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలోని దుష్టశక్తులను గ్రహించి వాటిని పారద్రోలడానికి నల్లపూసలు సాయపడతాయని నమ్ముతారు.

నల్ల పూసలను శివునికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే స్త్రీ మంగళసూత్రాన్ని తన భర్తకు రక్షణ కవచంగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా, అనేక మంది దేవీ దేవతలు మంగళసూత్రంలో నివసిస్తున్నారని కూడా నమ్ముతారు. ఇక, బంగారు మంగళసూత్రమే ఎందుకనే విషయానికి వస్తే.. బంగారంలో వైద్యం చేసే లక్షణాలు ఉన్నాయి.

ఇది వివాహిత స్త్రీలను ఆందోళన, టెన్షన్, ఒత్తిడి నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. బంగారం, నల్లపూసల్లోని క్రియాశీలత కారణంగా స్త్రీ శరీరంలోని దైవిక శక్తి మేల్కొంటుంది. దీనివల్ల ఆమె ప్రవర్తనలోనూ నెమ్మదితనం వస్తుంది. దీనితో పాటు, బంగారం బృహస్పతి ప్రభావాన్ని పెంచుతుంది. వైవాహిక జీవితాన్ని ఆనందపరుస్తుంది.




