AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soaked Dates: నీళ్లలో నానబెట్టిన ఖర్జూరాలు ఉదయాన్నే తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ఖర్జూరాలు నిజంగా ప్రకృతి వరం. సహజ చక్కెరలు కలిగి ఉండే ఈ ఖర్జూరాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడమేకాకుండా రక్త నాళాల పనితీరును నిర్వహిస్తుంది..

Srilakshmi C
|

Updated on: Oct 15, 2024 | 9:29 PM

Share
చాలా మంది డెజర్ట్‌లలో పంచదార కలపడం కంటే, ఖర్జూరాలను తీసుకుంటుంటారు. ఇది తీపి రుచిని పెంచడంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పలు రకాల వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు.

1 / 5
ఖర్జూరాన్ని ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అదే నీటిలో నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఫిట్‌గా కూడా ఉండవచ్చు. ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శారీరక అలసటను తొలగిస్తుంది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ రెట్టింపు అవుతాయి.

2 / 5
టానిన్లు, ఇతర హానికరమైన సమ్మేళనాలను తొలగించడానికి ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తీసుకోవాలి. ఖర్జూరం తేలికగా జీర్ణమవుతుంది. అలాగే, నీళ్లలో నానబెట్టడం వల్ల ఖర్జూరంలోని విటమిన్లు, మినరల్స్ మరింత చురుగ్గా మారతాయి.

3 / 5
ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. కీళ్ల నొప్పులను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా నానబెట్టిన ఖర్జూరాలు మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

4 / 5
నానబెట్టిన ఖర్జూరాలు గుండెను జాగ్రత్తగా చూసుకుంటాయి. ఈ డ్రై ఫ్రూట్‌లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త నాళాల పనితీరును నిర్వహిస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వర్షాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

5 / 5
Follow Us