- Telugu News Photo Gallery 5 Best Ways of Saying Sorry for long lasting Relationship with your partner
Relationship: రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ ఒక్క పని చేయండి.. ఇక ఆ విషయంలో తిరుగుండదు..
Relationship Advice: ఏ సంబంధంలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం.. అయితే రిలేషన్‌షిప్‌లో మీరు మీ పోరాటాలను వీలైనంత త్వరగా ముగించి మళ్లీ ప్రేమలో జీవించడం చాలా ముఖ్యం. దీని కోసం, మీ తప్పు కాకపోయినా చాలాసార్లు మీరు మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది.
Updated on: Feb 01, 2024 | 4:49 PM

Relationship Advice: ఏ సంబంధంలోనైనా గొడవలు అనేవి సర్వసాధారణం.. అయితే రిలేషన్‌షిప్‌లో మీరు మీ పోరాటాలను వీలైనంత త్వరగా ముగించి మళ్లీ ప్రేమలో జీవించడం చాలా ముఖ్యం. దీని కోసం, మీ తప్పు కాకపోయినా చాలాసార్లు మీరు మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఎలాంటి పొరపాటు లేకుండా మీ భాగస్వామికి క్షమాపణ చెప్పడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ, కొన్నిసార్లు క్షమాపణలు చెప్పేటప్పుడు, ఏదైనా క్షణికావేశంలో మాట్లాడటం వల్ల సంబంధం మరింత చెడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు భాగస్వామిని ఒప్పించే మార్గానికి శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం..

ప్రత్యేకించి మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గొడవల సందర్భంలో, మీరు మీ భాగస్వామిని కొంత సమయం పాటు ఒంటరిగా వదిలివేయాలని సలహా ఇస్తారు. కానీ సమయం గడిచేకొద్ది.. మీ భాగస్వామి మాట్లాడటానికి ప్రయత్నించకపోతే, మీరే చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. మీ భాగస్వామిని ఒప్పించే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి, లేకపోతే వారు మరింత కోపంగా మారే అవకాశం ఉంటుంది.

పశ్చాత్తాపం వ్యక్తం చేయండి: కొంతమంది నేరుగా తమ తప్పును అంగీకరించి వెంటనే క్షమించమని అడుగుతారు. కానీ ఇలా చేయడం ద్వారా, మీ భాగస్వామి కోపంతో దాని నుంచి పలు అర్థాలను తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల, మీరు క్షమాపణలు చెప్పినప్పుడల్లా, మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. తద్వారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే.. మీ భాగస్వామి చెడుగా భావించరు.

మీ తప్పును అంగీకరించండి: తగాదా తరువాత, చర్చ తరచుగా తప్పు ఎవరిది అనే దాని చుట్టూ తిరుగుతుంది. దీని కారణంగా, చాలా మంది జంటలు సమస్యను పరిష్కరించలేకతోతారు. నిజానికి, గొడవల సమయంలో మనం తరచుగా ఎదుటి వ్యక్తిని బాధపెట్టే మాటలు మాట్లాడుతుంటాం.. కానీ కోపంలో చాలా సార్లు మనం మన మాటలను తప్పుగా పరిగణించము. అందుకే, పోరాటం ముగిసిన వెంటనే మనం చేయవలసిన మొదటి పని మనం మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పడం.

బహుమతి ఇవ్వండి: తగాదా తర్వాత మీ భాగస్వామిని ఒప్పించడానికి ఉత్తమ మార్గం అతనికి ఇష్టమైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం.. దీని ద్వారా వారికి ప్రత్యేకించి క్షమాపణ కొరడం.. ప్రతి ఒక్కరూ బహుమతులు ఇష్టపడతారు, అది వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీకు కావాలంటే, మీరు మీ భాగస్వామి కోసం కొన్ని ప్రత్యేక వంటలను కూడా సిద్ధం చేయవచ్చు.

భరోసా ఇవ్వడం: పోరాటానికి కారణమైన తప్పును పునరావృతం చేయవద్దు. దీని కోసం, మీరు మళ్లీ ఈ తప్పు చేయరని మీ భాగస్వామికి భరోసా ఇవ్వండి. కానీ వాగ్దానం చేసిన తర్వాత, మీరు పొరపాటున కూడా ఈ తప్పు చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ బంధం చెడిపోతుంది.

క్షమాపణ చెప్పండి: కొన్ని పొరపాట్లకు మీరు మీ భాగస్వామికి క్షమాపణలు చెప్పడం అవసరం. తప్పులు ఇక చేయననని మాట ఇవ్వడంతోపాటు.. మిమ్మల్ని క్షమించమని మీ భాగస్వామిని అభ్యర్థించండి.




