CONGRESS STRATEGY: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం.. యుపీఏ బలోపేతానికి తొలి స్టెప్.. మొత్తం వ్యూహమిదే!

కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళ ముందే యుపీఏ బలోపేతానికి చర్యలు ప్రారంభించినట్లు తేటతెల్లమైంది ఈ బహిరంగ లేఖ ద్వారా. మిత్రపక్షాలను ఏకం చేయడం, కొత్త ఫ్రెండ్స్‌ని దగ్గర చేసుకోవడం అనే ద్విముఖ వ్యూహాన్ని యుపీఏ పెద్దన్న ప్రారంభించినట్లు తెలుస్తోంది.

CONGRESS STRATEGY: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం.. యుపీఏ బలోపేతానికి తొలి స్టెప్.. మొత్తం వ్యూహమిదే!
Politics
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 18, 2022 | 8:30 PM

CONGRESS STRATEGY UNDER IMPLEMENTATION 2024 GENERAL ELECTION TARGET: 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలయెన్స్ (యుపీఏ)ను బలోపేతం చేసేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి కూటమిలో పెద్దన్నగా తామేం చేయాలి.. అలియెన్స్‌లోని మిగిలిన పార్టీలు ఏం చేయాలి అనే దానికి సంబంధించిన పని విభజన జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చరిష్మాను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సిన అవసరాన్ని గుర్తించిన యుపీఏ సారథి సోనియాగాంధీ దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించడమే కాకుండా దాని అమలుకు కూడా శ్రీకారం చుట్టారు. ముందుగా మైనారిటీలకు యుపీఏని దగ్గర చేసే సంకల్పానికి శ్రీకారం చుట్టారు. దేశంలో మత విద్వేషాలు ప్రబలుతున్నాయంటూ అందుకు శ్రీరామనవమి, హనుమాన్ జన్మ పర్వదినం సందర్భంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అనుకూల 13 పార్టీల నేతలతో దేశ ప్రజలకు ఓపెన్ లెటర్ రాశారు. అయితే.. ఘర్షణలు జరిగిన పలు రాష్ట్రాలలో కొన్ని కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలున్న విషయాన్ని, శాంతి భద్రతల అంశం రాష్ట్రాల ఎజెండాలోనిదని కాంగ్రెస్ పెద్దలు చాలా కన్వీనియెంట్‌గా విస్మరించడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ళ ముందే యుపీఏ బలోపేతానికి చర్యలు ప్రారంభించినట్లు తేటతెల్లమైంది ఈ బహిరంగ లేఖ ద్వారా. మిత్రపక్షాలను ఏకం చేయడం, కొత్త ఫ్రెండ్స్‌ని దగ్గర చేసుకోవడం అనే ద్విముఖ వ్యూహాన్ని యుపీఏ పెద్దన్న ప్రారంభించినట్లు తెలుస్తోంది.

13 రాజకీయ పార్టీల అధినేతల సంతకాలతో దేశ ప్రజలకు రాసిన బహిరంగ లేఖ మరో అంశాన్ని కూడా వెల్లడించింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి తానే సారధ్యం వహిస్తానంటూ.. అవసరమైతే మోదీ చరిష్మాను తానే ఎదుర్కొంటానంటూ హూంకరించిన బెంగాల్ టైగర్, ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్ నాయకత్వంలో పని చేయడం ద్వారా తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీని దెబ్బకొట్టేందుకు సిద్దమైనట్లు ఈ బహిరంగ లేఖ వెల్లడించింది. ఈసారి యుపీఏను బలోపేతం చేసే బాధ్యతలను రాజకీయ దురంధరుడు శరద్ పవార్ తీసుకున్నట్లు పరిణామాలను పరిశీలిస్తే బోధపడుతోంది. కాంగ్రెస్ దూరంగా కొనసాగుతున్న మమతా బెనర్జీని యుపీఏకి దగ్గర చేసింది శరద్ పవారే అంటున్నారు. అదేసమయంలో బీజేపీ పట్ల గుర్రుగా వున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా యుపీఏను స్ట్రెంథెన్ చేసేందుకు తన వంతు బాధ్యతలు చేపట్టినట్లు కనిపిస్తోంది. యుపీఏలో లేని బీజేపీయేతర పార్టీలను కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేందుకు సంజయ్ రౌత్ యత్నాలు మొదలు పెట్టారు. దేశంలో రాజకీయ పరిస్థితులను చర్చించే పేరిట బీజేపీయేతర ముఖ్యమంత్రులను ముంబయి వేదికగా కలిపేందుకు రౌత్ ఏర్పాట్లు ప్రారంభించారు. దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వాటి వెనుక మత విద్వేషాలను రెచ్చగొట్టే సంఘ్ పరివార్ వ్యూహాలపై చర్చించే ఎజెండాతో బీజేపీయేతర సీఎంలను దేశ వాణిజ్య రాజధాని ముంబయి వేదికగా ఒకచోట చేర్చే బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తమ సహచర పార్టీ శివసేనకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఈ భేటీ నిర్వహిస్తే పలువురు సీఎంలు రాకపోవచ్చన్న వ్యూహంతోనే ఈ భేటీ నిర్వహణ బాధ్యతలను శివసేనకు అప్పగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. లెక్కచూపని ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. జాతీయ దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న అంశాని బీజేపీయేతర సీఎంల భేటీ ఎజెండాగా పేర్కొనడం విశేషం. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మత స్వేచ్ఛ వంటి అంశాలను కూడా ఈ భేటీ ఎజెండాగా చేర్చారు.

కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సక్సెస్సయితే మాత్రం మే నెలలోనే ముంబయి వేదికగా బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరగనున్నది. తద్వారా యుపీఏ బలోపేతం దిశగా కాంగ్రెస్ పార్టీ యత్నాలు వేగవంతం కానున్నాయి. ఓరకంగా చెప్పాలంటే ఏప్రిల్ 17వ తేదీ నాటి 13 పార్టీల బహిరంగ లేఖ ద్వారానే యుపీఏ పునరేకీరణ యత్నాలు ప్రారంభమైనట్లు భావించాలి. ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలు యుపీఏలో కొనసాగుతూ వస్తున్నాయి. తాజాగా 13 పార్టీలు కాంగ్రెస్ ఎంజెండాకు జై కొడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలో దేశంలో అసలు థర్డ్ ఫ్రంట్ (కొన్ని పార్టీలు దీన్నే ఫెడరల్ ఫ్రంట్ అనే పేరుతో పిలుస్తున్నాయి)కి ఆస్కారం వుందా ? ఇదిపుడు బాగా ఆసక్తి రేపే ప్రశ్నగా కనిపిస్తోంది. ఎందుకంటే థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను చేసిన నేతల్లో చాలా మంది మెల్లిగా కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. బెంగాల్‌లో సాధించిన ఘన విజయం తర్వాత దేశంలో మూడో ఫ్రంట్‌కు తానే సారథ్యం వహిస్తానని మాట్లాడిన మమతా బెనర్జీ ఇపుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్దమయ్యారు. అందుకే బహిరంగ లేఖలో ఆమె పేరు చేరింది. ఇంకోవైపు మూడో కూటమి గురించి ఎప్పుడూ మాట్లాడని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని కుదేలు చేసిన తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు రెడీ అవుతున్నట్లు జాతీయ మీడియా రాస్తోంది. ఇందుకు గోవాలో కాంగ్రెస్ పార్టీతో కలిసేందుకు కేజ్రీవాల్ ఇదివరకే విఫలయత్నం చేసిన ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే కాంగ్రెస్‌ పార్టీతో దూరాన్ని మెయింటేన్ చేస్తున్నారు. వీరిలో నవీన్ పట్నాయక్ సంగతి పక్కన పెడితే.. జగన్, కేసీఆర్‌లు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం కష్టమేనని భావించాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. దానికితోడు ఏప్రిల్ 17న హైదరాబాద్ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్.. టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ఇంకోవైపు వైసీపీ అధినేత జగన్.. సోనియా గాంధీ వల్లే తాను తన తండ్రి మరణానంతరం వెంటనే సీఎం కాలేకపోయానని భావిస్తారు. ఆయనా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు తక్కువే.

ఇక్కడ ఓ ఆసక్తికరమైన ఆబ్జర్వేషన్ గురించి చెప్పుకోవాలి. ఫెడరల్ ఫ్రంట్ పేరిట యత్నాలు మొదలు పెట్టిన కేసీఆర్.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వున్న పార్టీల నేతలను, సీఎంలనే కలిసారు. బీజేపీతో సన్నిహితంగా వున్న పార్టీలను, నేతలను ఆయన కల్వలేదు. దీని ఆధారంగా కేసీఆర్ ఫెడరల్ యత్నాలు యుపీఏని వీక్ చేయడం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను డిస్టర్బ్ చేయకపోవడమే కేసీఆర్ వ్యూహమన్న కంక్లూజన్‌కు కాంగ్రెస్ నేతలను చేర్చిందని తెలుస్తోంది. చెన్నై వెళ్ళి డిఎంకే అధినేత, సీఎం స్టాలిన్‌ను కలిశారు. అంతకు ముందు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ కేజ్రీవాల్‌తో భేటీ కాలేదు. మరో ఇతర బీజేపీ సానుకూల నేతలను కలిసి.. ఎన్డీయేను వీక్ చేసే యత్నాలు చేయలేదు కేసీఆర్. ఇలాంటి అంశాలను లోతుగా చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు వుండదని తేల్చి చెప్పినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇక రెండు నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. తాజాగా కాంగ్రెస్ పార్టీకి సన్నిహితమవుతున్నారు. ఆయనను పార్టీలో చేరాల్సిందిగా సోనియా, రాహుల్ సంయుక్తంగా కోరారు. ఆయనా అందుకు సిద్దమైనట్లు నేషనల్ మీడియా చెబుతోంది. ఇదే జరిగితే యుపీఏకు ప్రధాన వ్యూహకర్తగా పీకే మారనున్నారు. ఇదే జరిగితే జాతీయ స్థాయిలో కీలక పరిణామంగా చెప్పుకోవాలి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఎన్డీయే కూటమికి షాక్ ఇచ్చేదిగానే భావించాలి.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!