AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుడారంలో ప్రశాంతంగా పడుకున్న టూరిస్ట్.. అంతలోనే వచ్చిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..

Viral Video: సాహసం చేయడానికి ప్రపంచంలో చాలా మంది ప్రజలు వేర్వేరు ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి, జంతువులను ఇష్టపడే వారు అడవిలో..

Viral Video: గుడారంలో ప్రశాంతంగా పడుకున్న టూరిస్ట్.. అంతలోనే వచ్చిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..
Shiva Prajapati
|

Updated on: May 26, 2021 | 11:11 PM

Share

Viral Video: సాహసం చేయడానికి ప్రపంచంలో చాలా మంది ప్రజలు వేర్వేరు ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి, జంతువులను ఇష్టపడే వారు అడవిలో క్యాంప్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ ప్రయత్నం పర్యాటకులను ప్రమాదాల బారిన పడేస్తుంది. ఈ నేపథ్యంలో అడవిలో క్యాంప్‌ కు వెళ్లే పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అడవి జంతువులకు బలి అయ్యే ప్రమాదం ఉంది. తాజాగా ఓ టూరిస్ట్‌కి ఇలాంటి ప్రమాదమే ఎదురైంది. అడవిలో క్యాంప్‌కు వెళ్లిన వ్యక్తి తన గుడారంలో నిద్రిస్తుండగా.. ఓ ఎలుగుబంటి వచ్చింది. అతని కాలిని పట్టుకుని లాగే ప్రయత్నం చేసింది. అయితే అతను గట్టిగా మెసలడంతో ఆ ఎలుగుబంటి కాస్తా భయపడి పరుగులు తీసింది. ఈ ఘటన అంతా వీడియోలో రికార్డ్ కాగా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూడటానికి ఫన్నీగా ఉన్నప్పటికీ.. టూరిస్ట్‌లు జాగ్రత్త వహించకపోతే ఎంత ప్రమాకరమే తెలియజేస్తుంది. ఏదేమైనా.. టూరిస్ట్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడనే చెప్పాలి. అడవిలోనే అత్యంత క్రూరమైన జంతువులలో ఎలుగుబంటి కూడా ఒకటి. దానిబారిన పడితే ప్రాణాలు కోల్పోవడం తథ్యం అనే వాదన ఉంది. కానీ ఇక్కడ అతను కదలికలకు భయపడి ఆ ఎలుగుబంటి పారిపోవడం అతని అదృష్టం అని చెప్పాలి.

కాగా, చూడటానికి నవ్వు తెప్పిస్తున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎలుగుబంటి మనిషిని భయపెడుతుంది కానీ.. ఇక్కడ మనిషే ఎలుగుబంటిని భయటపెట్టాడు అంటూ ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు. ప్రాణాలతో చెలగాటం వద్దని, జాగ్రత్తంగా ఉండాలని మరికొందరు హితవు చెబుతున్నారు. ఇంకొందరైతే ఈ వీడియోపై మండిపడుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వీడియో షూట్ చేయడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.

Also read:

 Actor Varun Tej : మెగా హీరో కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. గని సినిమాలో అదే హైలైట్ అంట..

New Cars: కారులో ఈ ఐదు ఫీచర్లు ఉంటే ఎంత దూరమైనా హాయిగా ప్రయాణించొచ్చు.. అవేంటంటే..