AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 Actor Varun Tej : మెగా హీరో కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. గని సినిమాలో అదే హైలైట్ అంట..

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి  దరర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో

 Actor Varun Tej : మెగా హీరో కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. గని సినిమాలో అదే హైలైట్ అంట..
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 11:04 PM

Share

Actor Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి  దరర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా కానిపించనున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. కథను నమ్మి సినిమాలు చేస్తుంటాడు. ఇటీవల హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు వరుణ్. ఇక గని విషయానికొస్తే.. యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉన్న కథ ఇది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. ‘గని’ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఒక భారీ స్టేడియం సెట్ నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సెట్లో సినిమాకే హైలైట్ గా నిలవనున్న హై ఇంటెన్సిటీ బాక్సింగ్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు.

పలు హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ – లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర – బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి – విలక్షణ నటుడు జగపతిబాబు – నదియా – నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనిపించనుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krithi Shetty: తమ్ముడితో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అన్నకు జోడీగా రాబోతోందా..?

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్…

Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన మహేష్ హీరోయిన్.. మరోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న కీర్తి సురేష్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ