AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్…

హ్యాపీడేస్ సినిమాతో  టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు నిఖిల్. ఆ తర్వాత ఈ యంగ్ హీరో వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగాడు నిఖిల్.

యంగ్ హీరో బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న చిత్రయూనిట్.. స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న 18 పేజెస్ టీమ్...
Rajeev Rayala
|

Updated on: May 26, 2021 | 4:58 PM

Share

హ్యాపీడేస్ సినిమాతో  టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు నిఖిల్. ఆ తర్వాత ఈ యంగ్ హీరో వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగాడు నిఖిల్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నిఖిల్. చివరగా అర్జున్ సురవరం సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 తోపాటు 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి కథ- స్క్రీర్ ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. `కుమారి 21 ఎఫ్` ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట. నిఖిల్ కోసం అలంటి పాత్రనే సృష్టించాడట సుకుమార్.

ఈ సినిమాలో నిఖిల్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. అందులో ఒకపాత్ర గతం మరిచిపోయే నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. జూన్ 1న నిఖిల్ బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసేందుకు జీఏ2 సంస్థ సిద్ధమవుతోంది. “18 పేజెస్ నుంచి మరో చాప్టర్ ని రివీల్ చేసే టైమ్ వచ్చేసింది“ అని సదరు సంస్థ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

నటి సోనాల్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తండ్రితో కత్తితో దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు..

‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

Producer Annamreddy Krishna Kumar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!