‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

RRR Movie 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం.. రణం.. రుధిరం..) ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

'ఆర్ఆర్ఆర్' యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..
Rrr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 26, 2021 | 7:01 AM

RRR Movie ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం.. రణం.. రుధిరం..) ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, హీరోల మోషన్ పోస్టర్స్ కు రెస్పాన్ మాములుగా రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి.. అలాగే హీరోల్ రోల్స్ కు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్‌ సీన్‌ సినిమాకే హైలెట్‌ అన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అలాగే ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ గురించి వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను.. చిత్రరచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చిత్ర రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం మంచి పని కాదు.. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ.. గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో ఏదో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. మొదటి సారి ఫైట్ సీక్వెన్సెస్ కి ఎమోషన్ అవుతారు” అని అన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డీవీవి దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read: ‘F3’ సినిమా నుంచి మరో అప్ డేట్.. మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‏కు ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..

పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో