పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..

పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..
Prabhas

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్

Rajitha Chanti

|

May 26, 2021 | 5:58 AM

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ చూపు మొత్తం భారీ బడ్జెట్ సినిమాలపైనే పడింది. ఇక ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేసేందుకు అటు దర్శక నిర్మాతలు సైతం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం ఈ రెబల్ స్టార్.. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయాడు. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొుతుంది.

తాజాగా సమాచారం ప్రకారం.. రెబల్ స్టార్ ప్రభాస్ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారట. హాలీవుడ్ మూవీ టమిషన్ ఇంపాజిబుల్ 7టలో ప్రభాస్ నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్ ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇండియన్ యాక్టర్ ప్రభాస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడానికి ముందుకు వచ్చారని క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ మూవీ స్టోరీని… రాధేశ్యామ్ సినిమా కోసం గతేడాది ఇటలీ వెళ్ళినప్పుడు ప్రభాస్ కు వినిపించారట. ఈ చిత్రానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. ఇందులో తన పాత్రకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ కూడా పూర్తి చేసినట్లుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న విడుదల కానుంది.

Also Read: Taapsee Pannu: అలాంటి సినిమాలు చేసి టైమ్ వెస్ట్ చేయను.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్

Rao Ramesh First Look: మ‌హా స‌ముద్రంలో గూని బాబ్జీ.. ఆక‌ట్టుకుంటోన్న రావు ర‌మేశ్ ఫ‌స్ట్ లుక్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu