New Cars: కారులో ఈ ఐదు ఫీచర్లు ఉంటే ఎంత దూరమైనా హాయిగా ప్రయాణించొచ్చు.. అవేంటంటే..

New Cars: భారతదేశంలో వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దాంతో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా వాహన తయారీ సంస్థలు...

New Cars: కారులో ఈ ఐదు ఫీచర్లు ఉంటే ఎంత దూరమైనా హాయిగా ప్రయాణించొచ్చు.. అవేంటంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: May 26, 2021 | 11:04 PM

New Cars: భారతదేశంలో వాహనాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దాంతో వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా వాహన తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీతో వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో వినియోగదారుల సౌలభ్యం కోసం అద్భుతమైన ఫీచర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే, మీరు సుదీర్ఘ ప్రయాణానికి వెళితే, ఈ ఫీచర్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా అన్ని అనుకూలంగా ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నాయి.

భారతదేశంలో దాదాపు వినియోగదారులు హ్యాచ్‌బ్యాక్ మినహా కాంపాక్ట్ ఎస్‌యూవీ వైపు చూస్తున్నారు. తక్కువ డబ్బుతో ఎక్కువ హైటెక్ ఫీచర్లు కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు అంత్యంత అనువుగా ఉండే ఐదు కీలక ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సర్దుబాటు సీట్లు.. కారును తయారు చేసే సంస్థ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా సీట్లను డిజైన్ చేస్తుంది. ఎత్తు పెంచడం, తగ్గించడం.. ముందుకు, వెనక్కి జరపడం వంటివి ఒక్క బటన్ సహాయంతో సర్దుబాటు చేసుకునేలా సరికొత్త ఫీచర్లను కార్లలో అమర్చుతున్నారు.

సీట్లను చల్లార్చే ఆధునిక టెక్నాలజీ.. వేసవి కాలంలో వాహనాల సీట్లు చాలా వేడిగా ఉంటాయి. దాంతో కార్లలో ఆ సీట్లను చల్లార్చేందుకు ఏసీ వేస్తాం. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. అయితే, ఇప్పుడు ఆ సమస్య ఉండకుండా ప్రతీ కారు తయారీ కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగిస్తుంది. సీటు కింద కూలింగ్ కోసం ప్రత్యేకంగా ఫ్యాన్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇది లాంగ్ డ్రైవ్ చేసే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.

క్రూయిజ్ నియంత్రణ.. చాలా దూరం ప్రయాణించినప్పుడు వాహనం యొక్క వేగాన్ని నియంత్రించవచ్చు. అందుకు అనుగుణంగా టెక్నాలజీని ఏర్పాటు చేశారు. కారులో క్రూయిజ్ కంట్రోల్ ఉంటే అది మీ ప్రయాణాన్ని మరింత మెరుగు పరుస్తుంది. క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేయడం ద్వారా హైవే పై కారు ఒకే వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే యాక్సిలరేటర్, గేర్ లేకుండా వాహనాన్ని స్వయంచాలకంగా వదిలివేయవచ్చు.

స్టీరింగ్ మౌంటెడ్ ఫోన్, ఆడియో కంట్రోల్.. నేటి వాహనాల్లో ఏ వినియోగదారుడు కూడా మాన్యువల్ బటన్లను కోరుకోరు. తన అభిరుచి మేరకు ప్రతిదీ ఉండాలని కోరుకుంటాడు. అంటే, మధ్యలో ఉన్న బటన్‌తో పాటు, మీ కారు స్టీరింగ్‌లోనే ప్రతి బటన్ ఉండాలని భావిస్తాడు. తద్వారా కారులో ప్రతీదాన్ని డ్రైవింగ్ సీట్ నుంచే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ పెద్ద పెద్ద కార్లలో ఉంది.

కారు వెనుకవైపు డీఫాగర్, వైపర్.. వాహనం ముందు విండ్‌షీల్డ్‌లో మనకు వైపర్, మిగతా ఫీచర్లు ఉంటాయి. కాని వెనుక గ్లాస్ కోసం వైపర్, ఇతర ఏమీ ఉండవు. దాంతో చేతితో ప్రతిదీ చేయాలి. అందుకే కారు వెనుక భాగంలో వైపర్లు ఉండాలి, తద్వారా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవచ్చు. ట్రాఫిక్ సమయంలో అప్రమత్తంగా ఉండొచ్చు. అదే సమయంలో, పొగమంచును నియంత్రించేందుకు డీఫాగర్ ఉండాలి. తద్వారా వెనుకనుంచి వచ్చే వాహనాలకు మీ కారు కనిపిస్తాయి. ఎలాంటి ప్రమాదాలూ సంభవించవు.

Also read:

Acharya: ‘ఆచార్య’ మూవీలో చ‌ర‌ణ్ క్యారెక్టర్‌ ప్రీ క్లైమాక్స్‌లో చ‌నిపోతుందా.. ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతున్న న్యూస్

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ జేబులో ఒక్క పైసా కూడా ఉండదట.. కారణం ఏంటంటే..