Viral Video: పిల్లవాడిని అమాంతం పైకి లేపిన జిరాఫీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చూశారంటే షాక్ అవుతారు..!
Shocking Video: జంతువులను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పెద్దవాళ్లే జంతువులను చూసేందుకు జూ పార్క్‌లకు, ఫారెస్ట్ సఫారీలకు వెళ్తుంటారు...
Shocking Video: జంతువులను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పెద్దవాళ్లే జంతువులను చూసేందుకు జూ పార్క్‌లకు, ఫారెస్ట్ సఫారీలకు వెళ్తుంటారు. మరి పిల్లలకు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జంతువులను చూసి పిల్లలు తెగ మురిసిపోతారు. వాటిని చూసి ఆనందపడిపోతారు. వాటికి ఆహారం కూడా అందిస్తుంటారు. తల్లిదండ్రులు అయితే తమ పిల్లలచే జంతువులకు ఆహార పదార్థాలు తినిపిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ జూ పార్క్‌లో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్యనే ఉన్న పిల్లవాడు.. జిరాఫీకి గడ్డి మొక్కను తినిపించడానికి ప్రయత్నించాడు.
అయితే, ఆ పిల్లవాడు గడ్డి మొక్కను గట్టిగా పట్టుకోవడం.. జిరాఫీ అమాంతం ఆ మొక్కను నోట్లో పెట్టుకుని లాగడంతో పిల్లవాడు సైతం అమాంతం గాల్లోకి లేచాడు. వెంటనే అలర్ట్ అయిన అతని తల్లిదండ్రులు ఆ పిల్లాడి కాళ్లు పట్టుకుని గట్టిగా లాగారు. దాంతో అతను కిందకు వచ్చాడు. జిరాఫీ చేసిన స్టంట్‌కు ఆ పిల్లవాడు ఎక్కడో ఎగిరి పడేవాడు. ఈ ఘటనతో పిల్లవాడు తల్లిదండ్రులు తొలుత భయపడినా.. ఆ తరువాత నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. మరెందుకు ఆలస్యం.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also read:
Viral Video: గుడారంలో ప్రశాంతంగా పడుకున్న టూరిస్ట్.. అంతలోనే వచ్చిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..