AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Care about Seniors: ఇంట్లో పెద్ద వాళ్ళున్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా?

Care about Seniors: సాధారణంగా చిన్న పిల్లలు.. పెద్ద వాళ్ళు ఒకటే అంటారు. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏమి చెప్పినా తెలియదు. అర్ధం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్న పిల్లల్లానే ప్రవర్తిస్తారు.

Care about Seniors: ఇంట్లో పెద్ద వాళ్ళున్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా?
Care About Seniors
KVD Varma
|

Updated on: May 30, 2021 | 4:11 PM

Share

Care about Seniors: సాధారణంగా చిన్న పిల్లలు.. పెద్ద వాళ్ళు ఒకటే అంటారు. ఎందుకంటే చిన్న పిల్లలకు ఏమి చెప్పినా తెలియదు. అర్ధం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్న పిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారు ఉంటె, వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాకుతామో, ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సి వస్తుంది. వీరిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వారి సలహా తీసుకోండి..

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నపుడు ఇంటిలో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటె వారితో చర్చించండి. ఎందుకంటే, మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్ని విషయాలను వారు చూసి ఉంటారు. అదీకాకుండా మీరు సలహా అడిగితే, మీరు వారికిస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపెం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది.

డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్ల జాబితా..

అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాడు. మీరు లేని సమయంలో పెద్దవాళ్ళకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే.. ఏ డాక్టర్ కు ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలిసి ఉండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లనూ రాసి ఉంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎపుడైనా అత్యవసరం అయినపుడు ఆ నెంబర్లు ఉపయోగపడతాయి.

సాధ్యమైనప్పుడల్లా మీ సహాయం అందించండి

ఇంటిలో ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రానీయకండి. వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనులలో పడి కొంత సమయం గడిపేయగాలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరుచు అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే, మీరు అలా అడిగితే వారిపట్ల మీరెంతో శ్రధతో ఉన్న విషయం అర్ధం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులు ఉత్సాహంగా ఉంటాయి.

మీ ప్రియమైన వ్యక్తిని చురుకుగా ఉండటానికి ప్రోత్సహించండి

శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోటపని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుకుగా ఉండేలా చేస్తుంది.

చివరగా ఓ మాట.. పెద్ద వాళ్ళు పిల్లలు తమను పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతుంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాము కదా అనుకుంటాము. కానీ, వారు మీ నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలు వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా, రోజులో ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతొ కొద్ది సేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్న పిల్లలు.. పెద్ద వయసు వారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత.

Also Read: Shocking Video: షాకింగ్ వీడియో.. కోవిడ్‌ మృతదేహాన్ని నదిలో పడేసిన వ్యక్తులు..

Vedika: పదకొండు నెలల చిన్నారి ‘వేదిక’ కు ప్రపంచంలోనే ‘అతి ఖరీదైన’ చికిత్స.. దీని ఖర్చు ఎంతంటే..