Shocking Video: షాకింగ్ వీడియో.. కోవిడ్ మృతదేహాన్ని నదిలో పడేసిన వ్యక్తులు..
Covid Patient's Body - Watch Shocking Video: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి
Covid Patient’s Body – Watch Shocking Video: దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి, ఇంకొకరు కలిసి కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని గంగా, యమున నదుల్లో వందల సంఖ్యలో శవాలు తేలుతూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ వీడియో మరింత షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన మే 28న బలరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనను.. అటువైపుగా కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీశారు.
పట్టపగలు బ్రిడ్డిపై వాహనాలు తిరుగుతున్న సమయంలోనే పీపీఈ కిట్ ధరించిన వ్యక్తి మరొకరి సాయంతో మృతదేహాన్ని నదిలోకి పడేశారు. కాగా.. నదిలో పడేసింది.. కోవిడ్ పేషెంట్ మృతదేహమేనని బల్‌రామ్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీబీ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే బంధువులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా కరోనా బాధితుడు మే 25న చికిత్స కోసం బలరాంపూర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో మే 28న మరణించాడు. అతని మృతదేహాన్ని కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం అతని బంధువులకు అప్పగించగా.. వారు నదిలో పడేశారు.
వీడియో..
In UP’s Balrampur district, video of body of man being thrown in the river from a bridge has surfaced. The body was of a man who succumbed to Covid on May 28. pic.twitter.com/DEAAbQzHsL
— Piyush Rai (@Benarasiyaa) May 30, 2021
కాగా.. ఈ ఘటనపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర శేఖవత్ ట్విట్టర్‌లో స్పందించారు. గంగా నదిలో మృతదేహాలను వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
Also Read: