AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vedika: పదకొండు నెలల చిన్నారి ‘వేదిక’ కు ప్రపంచంలోనే ‘అతి ఖరీదైన’ చికిత్స.. దీని ఖర్చు ఎంతంటే..

Vedika: పూణేకు చెందిన వేదికా షిండే అనే 11 నెలల శిచిన్నారికి SMA టైప్ -1 అనే అరుదైన జన్యు రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది 2 సంవత్సరాల వయస్సులోపు పిల్లల ప్రాణాలను తీయగలదు.

Vedika: పదకొండు నెలల చిన్నారి 'వేదిక' కు ప్రపంచంలోనే 'అతి ఖరీదైన' చికిత్స.. దీని ఖర్చు ఎంతంటే..
Vedika
KVD Varma
|

Updated on: May 30, 2021 | 3:28 PM

Share

Vedika: పూణేకు చెందిన వేదికా షిండే అనే 11 నెలల శిచిన్నారికి SMA టైప్ -1 అనే అరుదైన జన్యు రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది 2 సంవత్సరాల వయస్సులోపు పిల్లల ప్రాణాలను తీయగలదు. వేదికా విషయంలో, ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ జరిగింది. దీంతో ఆమెను రక్షించగలమనే ఆశాభావం డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిన్నారిని కాపాడటానికి 16 కోట్ల రూపాయల ఖర్చయ్యే ఒక జన్యు పునఃస్థాపన చికిత్స (జోల్జెన్స్మా) ను అత్యవసరంగా దిగుమతి చేసుకోవలసి వచ్చింది. అయితే, అంత సొమ్ము ఖర్చు చేయగలిగే స్తోమత వేదిక తల్లిదండ్రులకు లేదు. దీంతో వారు నిధుల సేకరణ వేదిక మిలాప్‌లో వారి కథనాన్ని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ దాతల నుండి సహాయం కోరారు. మార్చి నెలలో ఏర్పాటు చేసిన నిధుల సమీకరణకు తరువాతి రోజులలో భారీ మద్దతు లభించింది.

మూడు నెలల్లోపు, మిలాప్ ప్రచారానికి మద్దతు ఇచ్చిన దాతల ఔదార్యంతో 14.3 కోట్ల రూపాయలు సేకరించారు. పన్నులు, దిగుమతి సుంకాలపై ప్రభుత్వ అధికారుల నుండి మాఫీ పొందడంలో తల్లిదండ్రులు విజయవంతమయ్యారు. జోల్జెన్స్మా కోసం ప్రఖ్యాత యుఎస్ ఔషధ సంస్థకు వైద్యులు ఇప్పటికే ఒక అభ్యర్థనను చేశారు. దీంతో ఇప్పుడు వేదికకు చికిత్స చేయడానికి పరస్థితి వీలుగా మారింది. నిజానికి జూన్లో తన మొదటి పుట్టినరోజుకు ముందే చికిత్స పొందాల్సిన వేదికా, ఇప్పుడు ఆమె కోసం తయారుచేసిన మందులను తీసుకోవడానికి వీలుగా కావలసిన పరీక్షలు చేయించుకుంటోంది. అమెరికా నుంచి వేదికా చికిత్సకు అవసరమయ్యే మందు జూలై 2 నాటికి చేరుకుంటుంది. చికిత్స జూలై 7 -10 తేదీల మధ్య జరుగుతుందని భావిస్తున్నారు.

మిలాప్ పై నిధుల సేకరణ ప్రచారం ప్రారంభ దశలోనే వేదికా కేసు మీడియా నుండి గొప్ప దృష్టిని సంపాదించింది. మొదటి వారంలో 1 కోట్ల రూపాయల మొత్తాన్ని సేకరించారు. మిలాప్‌లో ఇదే కారణంతో దాదాపు 50 మద్దతు ప్రచారాలు ప్రారంభించరు. బర్ఖా సింగ్, మాస్టర్ చెఫ్ షిప్రా ఖన్నా వంటి అనేక సోషల్ మీడియా ప్రభావశీలురులు, అనుప్రియా కపూర్ వంటి పేరెంటింగ్ ప్రభావశీలులు ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కావడంలో సహాయపడ్డారు.

ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై అభిమానులను విజ్ఞప్తి చేయడం ద్వారా తన మద్దతును అందించడానికి ముందుకు వచ్చారు. మిలాప్ చేసిన వీడియో, దీనిలో వేదికా తల్లి స్నేహ విజ్ఞప్తి చేస్తుంది. ఫేస్‌బుక్‌లో 3 లక్షల మంది దీనిని వీక్షించారు. విపరీతమైన ప్రతిస్పందనతో లోతుగా కదిలిన తల్లిదండ్రులు ఇటీవల మిలాప్ యొక్క నిధుల సమీకరణ పేజీలో మరొక వీడియోను పోస్ట్ చేసారు. వేదికాకు మంచి జీవిత నాణ్యతను ఇవ్వడానికి సహాయం చేసినందుకు దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Boris Johnson: రహస్యంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం.. చివరి నిమిషంలో అతిథులకు ఆహ్వానం!

Coronavirus: ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌… రక్తం విషపూరితం.. మృతి