AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rani Padmini: హిస్టరీలో మిస్టరీగా మిగిలిన కోట.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో.. ఇప్పటికీ రాణి పద్మావతి గజ్జెల చప్పుళ్లు

Rani Padmini: భారత దేశ చరిత్రలో అనేక రహస్యాలు... కొన్ని రహస్యాలను సైన్స్ సైతం కనిపెట్టలేవి ఉన్నాయి. అలా ఎన్నో వంటల ఏళ్లగా ఎవరు చేధించలేని మిస్టరీ కోటగా..

Rani Padmini: హిస్టరీలో మిస్టరీగా మిగిలిన కోట.. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో.. ఇప్పటికీ రాణి పద్మావతి గజ్జెల చప్పుళ్లు
Rani Padmavati Port
Surya Kala
|

Updated on: Jun 03, 2021 | 7:14 PM

Share

Rani Padmini: భారత దేశ చరిత్రలో అనేక రహస్యాలు… కొన్ని రహస్యాలను సైన్స్ సైతం కనిపెట్టలేవి ఉన్నాయి. అలా ఎన్నో వంటల ఏళ్లగా ఎవరు చేధించలేని మిస్టరీ కోటగా హిస్టరీలో నిలిచిపోయినవి అనేకం ఉన్నాయి. కొన్ని కోటలు ఎన్నో అద్భుతాలను, ఎన్నో విశేషాలను, అంతకంటే ఎక్కువ రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్నాయి వాటిల్లో ఒకటి రాణి పద్మావతి నివసించిన కోట.

కల్పితమో నిజమో తెలియని ఒక రాణి జీవితం చుట్టూ అల్లుకున్న కథలకు సాక్ష్యాలుగా చెప్పబడుతున్న ఎన్నో కట్టడాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. ఇంతకీ ఏంటా కోట రహస్యం. అవును.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. రాణీ పద్మావతికి సంబంధించి రాజస్ధాన్‌లోని చిత్తోర్‌గఢ్‌ స్ధానికులు వందల ఏళ్లుగా నమ్ముతున్న ఒక ఆశ్చర్యకర కధ ఇది. ఆమె కోటలో ఉన్న సొరంగాల్లో వందల ఏళ్లుగా నిక్షిప్తమైన రహస్యం ఇది. గోముఖమనే చెరువులో స్నానం చేయడానికి రోజూ రాణి పద్మావతి ఈ సొరంగం గుండా వెళ్లేదని, అందులో ఆత్మలు తిరుగుతుంటాయని ఇప్పటికీ స్ధానికులు కధలు కధలుగా చెప్పుకుంటారు. అందుకే.. ఉదయమంతా పర్యాటకులతో కిటకిటలాడే ఈ కోటలో..సాయంత్రం అయితే చాలు.. నిశ్శబ్దం అలుముకుంటుంది. తీతువుల శబ్దాలు.. అంతుబట్టని స్వరాలు భయపెడుతుంటాయి. బొట్టు బొట్టుగా కారే నీళ్ల కింద నుంచి భయపెట్టే చప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఇదే కోటలో రాణీ పద్మావతి దేవాలయం కూడా ఉంది. రోజూ రాణి ఆత్మ ఇక్కడకు వస్తుందని, అలా జరిగినప్పుడు ఈ దేవాలయం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయని స్ధానికులు చెప్తారు. 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోటలో రాణి పద్మావతి తనను తాను నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడిందట. అర్ధరాత్రి దాటాక చిమ్మచీకటిలో అక్కడకు వెళితే రాణి అరుపులు, గజ్జెల చప్పుళ్లు స్పష్టంగా వినిపిస్తాయట.

Also Read: నిద్రపోయే ముందు యాలకు తిని వేడి నీరు తాగితే కలిగే అద్భుత ఫలితాలు తెలిస్తే వదలరుగా..