Suicide Plant: ప్రపంచంలోనే డేంజర్ మొక్కల్లో ఇది ఒకటి.. దీనిని తాకితే నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటారట
Suicide Plant: మొక్కలు మానవుడికి ప్రాణాధారం. మొక్కలతో మనిషికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే కొని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే...
Suicide Plant: మొక్కలు మానవుడికి ప్రాణాధారం. మొక్కలతో మనిషికి ప్రత్యేక అనుబంధం ఉంది. అయితే కొని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే…. మరికొన్ని మొక్కలు కీటకాలను తింటాయి.. అయితే ఇంకొన్ని మొక్కలు ప్రాణాలను సైతం తీస్తాయట. అవును మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కలు ఏమిటో అవి ఎక్కడ ఉంటూ తెలుసుకుందాం..
మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి గింపీ-గింపీ మొక్కలు. వీటి ఆకుని పొరపాటున కూడా తాకకూడట.. ఒకవేళ ఈ మొక్క ఆకుల్ని టచ్ చేస్తే.. భయంకరమైన నొప్పి వస్తుందట. ఈ నొప్పిని భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనే ఫీలింగ్ కూడా వస్తుందట. ఈ మొక్కలు ఆస్ట్రేలియా దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
గింపీ-గింపీ ముళ్ల మొక్క గిరించి తెలియక పూర్వం ఈ మొక్కని తాకితే శపిస్తుంది అందుకే ఇంట భయంకరమైన నొప్పి గిరిజనలు అనుకునేవారు. ఈ మొక్క ఆకులు రావి ఆకులను పోలి ఉంటాయి, ఆకులపై సన్నటి ముల్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలుగుతుంటే.. అదేవిధంగా నొప్పితో బాధపడతారు. ముఖ్యంగా ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత రెండు గంటలపాటు వచ్చే నొప్పిని భరించడం కంటే మరణం మేలు అనిపిస్తుంది.
ఈ ముళ్ళు శరీరంలో ఉన్నంతసేపు ఆ నొప్పి తగ్గనే తగ్గదు. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన అనంతరం కూడా ఆ నొప్పి చాలా సంవత్సరాల పాటు ఉంటుందట. అందుకనే ఈ గింపీ గింపీ మొక్కని ప్రపంచంలోని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని పరిశోధకులు చెబుతారు. ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్.
Also Read: Tokyo Olympics 2021: 10 గోల్డ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో జపాన్.. 39 వ స్థానంలో భారత్