మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో అడవిపిల్లి హల్చల్, చిరుతపులి అనుకొని బిత్తరపోయిన జనం
తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీ ఏరియా మారేడుమిల్లి మండలం పన్నీర్ మామిడితోటలో అడవి పిల్లి హల్చల్ చేసింది. కంటి చూపులకు చిరుత పులి రేంజ్ లో ఉన్న అడవిపిల్లిని..
తూర్పు గోదావరిజిల్లా ఏజెన్సీ ఏరియా మారేడుమిల్లి మండలం పన్నీర్ మామిడితోటలో అడవి పిల్లి హల్చల్ చేసింది. కంటి చూపులకు చిరుత పులి రేంజ్ లో ఉన్న అడవిపిల్లిని చూసిన జనం ఒక్కసారిగా కంగారెత్తిపోయారు. పసుపు రంగు, నల్ల మచ్చలు కలిగి ఉండడంతో కచ్చితంగా చిరుతపులే అనుకొని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, కోళ్లను వేటాడటానికి వచ్చిన అడవి పిల్లి కోళ్లపై దాడి చేసి వాటిని తినే ప్రయత్నం చేసింది. దీంతో పిల్లిని బుట్టలో బంధించిన గ్రామస్థులు, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ అధికారులు అడవిపిల్లిని స్వాధీన పరుచుకుని Jungle cat (అడవి పిల్లి)గా తేల్చారు.
Read also : 2021లో ఐపీవోకి వెళ్లబోతోన్న టాప్ 10 కంపెనీలు, భారీ స్థాయిలో పెట్టుబడుల సమీకరణకు అడుగులు