Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతిలో జీవులకు ప్రత్యేకబంధం ఉందా, ఉత్తరాఖండ్ విలయాన్ని చేపలు ముందే గుర్తించాయా! అలకనందనది నీరు బురదగా ఎందుకు మారింది..?

ప్రకృతితో జంతువులకు పక్షులకు ప్రత్యేక బంధం ఉంటుందా.. అందుకనే సునామీ, తుఫాన్ వంటి వైపరీత్యాలు ఏర్పడే మందు పక్షులు గుంపులు గుంపులుగా తమ గూటికి ముందే చేరుకుంటాయా.. ఇక భూకంపం వచ్చే ముందు ఆ ప్రాంతంలోని కుక్కలు.. తాజాగా ఉత్తరాఖండ్ లోని విలయాన్ని అలకనంద నదిలోని చేపలు ముందే గుర్తించాయా..!

ప్రకృతిలో జీవులకు ప్రత్యేకబంధం ఉందా, ఉత్తరాఖండ్ విలయాన్ని చేపలు ముందే గుర్తించాయా! అలకనందనది నీరు బురదగా ఎందుకు మారింది..?
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2021 | 4:10 PM

Uttarakhand flood: ప్రకృతితో జంతువులకు పక్షులకు ప్రత్యేక బంధం ఉంటుందా.. అందుకనే సునామీ, తుఫాన్ వంటి వైపరీత్యాలు ఏర్పడే మందు పక్షులు గుంపులు గుంపులుగా తమ గూటికి ముందే చేరుకుంటాయా.. ఇక భూకంపం వచ్చే ముందు ఆ ప్రాంతంలోని కుక్కలు ఎందుకు అరుస్తాయి. అంటే ప్రకృతి వైపరీత్యాలను ముందే జంతువులు, పక్షులు గుర్తిస్తాయా..! ఇవన్నీ సైన్సు కు మానవ మేధస్సుకు అందని ప్రశ్నలే..

తాజాగా ఉత్తరాఖండ్ లో నందాదేవి గ్లేసియర్ లో మంచు చెరియలు విరిగి పడి ధౌలిగంగ నది భారీ విలయాన్ని సృష్టించింది. అయితే ఈ విలయానికి సరిగ్గా ఓ గంట ముందు ఆ ప్రాంతానికి సుమారు 70 కి. మీ దూరంలో ఉన్న లాస్ గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. ఆ వింత‌ను చూడ‌టానికి గ్రామంలోని ప్ర‌జ‌లు క‌నీసం ఇంటికి ఒక‌రైనా అక్క‌డికి వచ్చారు. అలకనంద నదిలో ఫిబ్రవరి 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో వేళా కొద్దీ చేపలు నది ఒడ్డుకు దగ్గరగా చేతికి అందేటంత లోతులోనే వేరే ప్రాంతానికి వెళ్తున్నాయి. ఈ చేపల ప్రయాణాన్ని చుసిన స్థానికులు ఆశ్చర్య పోయారు. చాలా మంది చేతులతో అందిన చేపలను కుప్పలు కుప్పలుగా పట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లారు.

అయితే తమ ప్రాంతానికి సమీపంలోనే ఓ ప్రకృతి విలయం రాబోతున్నదని ఆ స్థానికులు ఊహించలేదు.. అలకనంద ఉపనది అయిన దౌలిగంగ హిమనీనదాలు విరిగిపడి .. ఆకస్మికంగా వరద ఏర్పడింది.

ఇదే విషయం పై స్థానికుడు అజయ్ పురోహిత్ స్పందిస్తూ.. సాధారణముగా చేపలు ఎప్పుడూ అలా ఒడ్డుకు చెరువుగా.. చేతికి అండ్ విధంగా వెళ్లవని నది మధ్యలో చాలా లోతు ప్రాంతంలో ఉంటాయని చెప్పారు. చేపలు అలా వెళ్లడం చూసి తాము ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాయని ఆశ్చర్య పోయామే తప్ప.. కనీసం అప్పటికే అలకనంద నదిలోని ఆకుపచ్చ రంగు నీరు బురద రంగులోకి మారడాన్ని తాము గుర్తించలేదని గ్రామస్థులు చెప్పారు.

ఇదే విషయం పై వైల్డ్ లైఫ్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో సీనియర్ సైంటిస్టు శివ‌కుమార్ స్పందిస్తూ.. ఇలాంటి విపత్తులను చేపలు ముందే గుర్తిస్తాయని చెప్పారు. నీటి ప్రవాహంలో తేడా ప్రకంపనలను చేపల సెన్సార్ వ్యవస్థకు ముందే తెలిసి ఉంటుందని చెప్పారు. చేపలకు పార్శ్వ రేఖా అవ‌య‌వాలు ఉంటాయి. వీటి ద్వారా నీళ్ల‌లో క‌ద‌లిక‌లు, ఒత్తిడిలో మార్పును ఇవి గుర్తిస్తాయని అందుకే అవి ముందుగా తమ స్థానాన్ని మార్చుకోవడానికి పయనం అయ్యి ఉంటాయని అంచనావేస్తున్నారు శాస్త్రజ్ఞులు. పార్శ్వ రేఖా అవ‌య‌వాలు చాలా సున్నిత‌మైన‌వి. చిన్న మార్పు కూడా వీటిని క్రియాశీలం చేసి చేప‌లను షాక్‌కు గురి చేస్తాయి అని శివ‌కుమార్ చెప్పారు. ఈ సంద‌ర్భంలో వ‌ర‌ద ముందు వ‌చ్చిన శ‌బ్దాన్ని చేప‌లు ముందే గ్ర‌హించి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. ఏది ఏమైనా మానవుడు ప్రకృతి పై పై చేయి సాధించాఅనుకున్న సమయంలో మానవ మేధస్సుకు పదును పెడుతూ సరికొత పజిల్ ను ముందుకు తెస్తోంది.

Also Read:

Viral Photo: ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిళ దూకుడు, ఈనెల 20న ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం