Viral News: వామ్మో.. పిడుగులా.. మృత్యుపాశాలా..? ఐదేళ్లలో ఆ రాష్ట్రంలో ఏకంగా 1,621 మరణాలు

Janardhan Veluru

Janardhan Veluru |

Updated on: Sep 03, 2021 | 6:25 PM

ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతియేటా వేల సంఖ్యలో మరణిస్తుంటారు. పిడుగుపాటు కారణంగానూ భారీ సంఖ్యలోనే మరణాలు సంభవిస్తుంటాయి.

Viral News: వామ్మో.. పిడుగులా.. మృత్యుపాశాలా..? ఐదేళ్లలో ఆ రాష్ట్రంలో ఏకంగా 1,621 మరణాలు
Lightning Strikes

Lightning Strikes: ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తుల కారణంగా ప్రతియేటా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. పిడుగుపాటు కారణంగానూ భారీ సంఖ్యలోనే మరణాలు నమోదవుతుంటాయి. ఒడిశాలో సంభవించిన పిడుగుపాటు మరణాలకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆ రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏకంగా 1,621 మంది పిడుగుపాటు కారణంగా బలయ్యారు. ఆ మేరకు ఒడిశా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుదాం మరాండి ఆ రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. 2017-18లో అత్యధికంగా 472 మంది పిడుగుపాటుతో మరణించారు. 2018-19లో 340 మందిని పిడుగులు బలితీసుకున్నాయి. 2019-20లో 357 మంది, 2020-21లో 274 మందిని మాయదారి పిడుగులు బలితీసుకున్నాయి. ప్రస్తుత సంవత్సరం ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 178 మంది పిడుగుపాటుతో మరణించారు. పిడుగుపాటుతో మరణించే వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ ఐదేళ్లలో పిడుగుపాటుతో 73 మంది గాయపడినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. పిడుగులకు సంబంధించి ముందస్తు సమాచారం కోసం రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో డిటెక్షన్ సెన్సార్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీరిచ్చే సమాచారంతో పిడుగులు పడే అవకాశమున్న ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.

Lightning Strikes

Lightning Strikes

ఒడిశాలో పిడుగుల కారణంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించడం ఆ రాష్ట్ర మీడియాతో పాటు జాతీయ మీడియా వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. పిడుగులను ముందుగానే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు విపత్తుల నిర్వహణ శాఖ మరింత కీలక పాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read..

Viral Video: తలపై పుచ్చకాయతో పవర్‌ఫుల్ స్టెప్పులు.. మనోడి ప్రతిభకు ఫిదా అవుతోన్న నెటిజన్లు

అమ్మాయిలు ఈ 4 అలవాట్లున్న అబ్బాయిలను కచ్చితంగా తిరస్కరిస్తారు..! ఎందుకంటే..?

ఆదుకునే అంబులెన్స్‌‌‌కే ఆరోగ్యం పాడైతే.. ఎవరు సాయం చేశారో చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu