Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తలపై పుచ్చకాయతో పవర్‌ఫుల్ స్టెప్పులు.. మనోడి ప్రతిభకు ఫిదా అవుతోన్న నెటిజన్లు

ఈ రోజుల్లో ఓ వ్యక్తి మాములుగా డ్యాన్స్ చేసిన వీడియోలే వైరల్‌గా మారుతున్నాయి. మరి తలపై పుచ్చకాయతో పార్టీలో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ చూసిన వారంతా ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: తలపై పుచ్చకాయతో పవర్‌ఫుల్ స్టెప్పులు..  మనోడి ప్రతిభకు ఫిదా అవుతోన్న నెటిజన్లు
Viral Dance
Follow us
Venkata Chari

|

Updated on: Sep 03, 2021 | 6:01 PM

Viral Video: వివాహాలు, పార్టీలలో ప్రజలు సరదాగా నృత్యం చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాతావరణంలో వచ్చే సంగీతాన్ని విన్న తర్వాత దాదాపు అందిరి కాళ్లు ఆటోమేటిక్‌గా కదలడం సహజమే. అయితే అందరిలా డ్యాన్స్ చేస్తే ఏముందనుకున్నాడో ఏమో.. ఏకంగా తలపై పుచ్చకాయతో అదిరిపోయే స్టెప్పులు వేసి ఔరా అనిపిస్తున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

పార్టీలలో తమ భాగస్వాములతో డ్యాన్స్ చేయడం మాములే. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి ఓ పెద్దాయనతో కలిసి తలపై పుచ్చకాయను ఉంచుకుని మరీ డ్యాన్స్ చేశాడు. పార్టీ వాతారవణం ఉన్నట్టు వీడియోలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ బాణీకి సంతోషంగా కాళ్లు కదుపుతున్నారు. ఈ టైంలోనే ఓ వ్యక్తి ఆనందంతో నృత్యం చేస్తూ అక్కడకు వచ్చి ఎదురుగా నిలబడిన వ్యక్తి నుంచి పుచ్చకాయను తీసుకొని, తన తలపై పెట్టుకుని, బ్యాలెన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశాడు.

సోషల్ మీడియాలో ఈయన డ్యాన్స్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోపై చాలా మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘పుచ్చకాయ ప్రమాదవశాత్తు పాదాలపై పడితే, అప్పుడు ఉంటది మజా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా, ‘బ్రదర్, బ్రదర్ ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేశావో’ అని పొగిడాడు. ‘ ఈ వ్యక్తి టాలెంట్ షో పార్టిసిపెంట్ అయి ఉంటాడు అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. మీరూ ఈ వీడియోను చూడండి..

View this post on Instagram

A post shared by hepgul5 (@hepgul5)

Also Read:

Bullet Bandi Song: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి పాటతో ట్రీట్మెంట్.. వైరల్ వీడియో

Viral Video: ఆయుష్షు గట్టిదైతే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి.. రెప్పపాటు క్షణంలో పెను ప్రమాదం ఎలా తప్పిందో చూడండి.