AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sansad TV YouTube: సన్సద్ టీవీ ఖాతాను టెర్మినేట్ చేసిన యూట్యూబ్.. ఇంత వరకు స్పందించని కేంద్ర ప్రభుత్వం..

యూట్యూబ్ సన్సద్ టీవీ ( YouTube) (Sansad TV YouTube) ఖాతాను యూట్యూబ్ మూసివేసింది. ఛానెల్ పేజీలో..

Sansad TV YouTube: సన్సద్ టీవీ ఖాతాను టెర్మినేట్ చేసిన యూట్యూబ్.. ఇంత వరకు స్పందించని కేంద్ర ప్రభుత్వం..
Sansad Tv
Sanjay Kasula
|

Updated on: Feb 15, 2022 | 1:11 PM

Share

యూట్యూబ్ సన్సద్ టీవీ ( YouTube) (Sansad TV YouTube) ఖాతాను యూట్యూబ్ మూసివేసింది. ఛానెల్ పేజీలో “YouTube కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతా మూసివేయబడింది” అని పేర్కొంది. సోమవారం అర్థరాత్రి పార్లమెంట్ టీవీ యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందని పేర్కొంటూ కొంతమంది యూజర్లు సోషల్ మీడియా వెబ్‌సైట్ రెడ్డిట్‌లో స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లోని వినియోగదారులు కూడా దీనిని గమనించారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

సోషల్ మీడియాలో ఏం జరుగుతోంది?

చాలా మంది వినియోగదారులు స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ఖాతాను అర్థరాత్రి హ్యాక్ చేసి ‘ఎథెరియం’గా మార్చారని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియో కూడా లైవ్ అని క్లెయిమ్ చేశారు. చివరి వీడియో సోమవారం రాత్రి 10.35 గంటలకు పార్లమెంట్ టీవీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఇది YouTubeకి లింక్‌ను కలిగి ఉంది. అది ఇకపై అందుబాటులో ఉండదు. సన్సద్ టీవీ( Sansad TV) నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్‌లు లేవు.

రాజ్యసభ టీవీ, లోక్‌సభ టీవీలను విలీనం చేయడం ద్వారా పార్లమెంట్ టీవీని ఏర్పాటు చేశారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి ‘పార్లమెంట్ టీవీ’గా నామకరణం చేసింది. రిటైర్డ్ IAS రవి కపూర్ మార్చి 2021లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా నియమితులయ్యారు. పార్లమెంట్ టీవీని సెప్టెంబర్ 15, 2021న వైస్ ప్రెసిడెంట్ ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో వెంకయ్యనాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిదే. యూట్యూబ్‌లోని రాజ్యసభ టీవీ ఖాతాను పార్లమెంట్ టీవీగా మార్చారు. ఆ ఖాతాను ఇప్పుడు యూట్యూబ్ తొలగించింది.

ఆర్మీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలు బ్లాక్ చేయబడ్డాయి

ఇటీవల, ఫేస్ బుక్ (Facebook), ఇస్టాగ్రామ్ (Instagram) చినార్ కోర్ వెరిఫైడ్ ఖాతాలను బ్లాక్ చేశాయి. వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫిబ్రవరి 10న పునరుద్ధరించబడింది. చినార్ కార్ప్స్ ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఖాతాలు మూసివేయబడిన వార్త మీడియాలో వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుంచి అధికారులు సంబంధిత ఆర్మీ అధికారులను సంప్రదించారు. కోర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ 4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చినార్ కార్ప్స్ ఈ రెండు సోషల్ మీడియా పేజీల ద్వారా లోయల్లోని వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది.

ఇవి కూడా చదవండి: Jwala Gutta: మీ రాజకీయాలు ఆపండి.. హిజాబ్ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల

CM Jagan: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌