Embassy of India: అక్కడి నుంచి భారతీయులు వెనక్కు వచ్చేయండి.. సర్క్యూలర్ జారీ చేసిన విదేశీ వ్యవహారాల శాఖ
Ukraine Conflicts: ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు, అక్కడ నివాసించడం అంతగా అవసరం లేనివారిని..
Embassy of India on Ukraine – Russia tensions: ఉక్రెయిన్-రష్యా యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వ(Government of India) కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్-రష్యా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలతో ఇండియా(India) అలర్ట్ అయింది. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది విదేశీ వ్యవహారాల శాఖ(Department of Foreign Affairs). ఉక్రెయిన్‌లో ఉండే వారు నిరంతరం అలర్ట్‌గా ఉండాలని అంటూనే.. ఎవరైనా పని లేకుండా ఉన్న వారు వెంటనే ఇండియాకి వచ్చేయాలని ఆదేశించింది. పని లేకుండా అక్కడ ఉండి ఇబ్బందులు పడేకన్నా.. సురక్షితంగా ఇండియాకు చేరుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక సర్క్యూలర్‌ను జారీ చేసింది.
ఉద్యోగరిత్యా అక్కడ ఉన్నా.. నిరంతరం పరిస్థితులను పరిశీలిస్తూ.. అలర్ట్‌గా ఉండాలని సూచించింది. ఇండియాకు చెందిన వారు ఉక్రెయిన్‌లో దాదాపు 18 వేల నుంచి 20వేల మంది వరకు ఉంటారని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులోనూ ఎక్కువగా విద్యార్థులు అక్కడికి స్టడీ కోసం వెళ్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఉక్రెయిన్ వెళ్లే భారతీయులు కూడా ప్రయాణాల రద్దు చేసుకోవాలని సూచించింది. అక్కడ ఉన్న భారత ఎంబసీకి తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది.
ఇప్పటికే పలు దేశాలు కూడా ఉక్రెయిన్‌లో ఉండే వారిని అలర్ట్ చేశాయి. వెంటనే ఉక్రెయిన్‌ను వీడి వెనక్కు రావాలని ఆదేశాలు కూడా జారీ చేశాయి. ఉక్రెయిన్‌లో ఉన్న పలు దేశాల ఎంబసీలు కూడా మూత పడ్డాయి. పలు దేశాలకు చెందిన విమాన సంస్థలు కూడా తమ తమ విమాన సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. దీంతో గంట గంటకు ఉక్రెయిన్ పరిస్థితులు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పువు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల మధ్య జనం బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బోర్డర్‌లో మాత్రం రెండు దేశాలకు చెందిన సైనికులు డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
Read Also…. Ukraine Conflicts: ఉక్రెయిన్-రష్యా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు.. అసలు రెండు దేశాల మధ్య ఎక్కడ చెడింది?