AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaipur Road Accident: జైపూర్ సమీపంలోని భబ్రూ వద్ద ఘోర ప్రమాదం.. పోలీసులు సహా మొత్తం ఐదుగురు మృతి..

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని షాపురా ప్రాంతంలోని భబ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు గుజరాతీ పోలీసులు..

Jaipur Road Accident: జైపూర్ సమీపంలోని భబ్రూ వద్ద ఘోర ప్రమాదం.. పోలీసులు సహా మొత్తం ఐదుగురు మృతి..
Massive Road Accident
Sanjay Kasula
|

Updated on: Feb 15, 2022 | 1:30 PM

Share

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని షాపురా ప్రాంతంలోని భబ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు గుజరాతీ పోలీసులు మరణించారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. NH-48లోని నిజార్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. బీరత్‌నగర్ ప్రాంతంలోని 48వ జాతీయ రహదారిపై ఈ ఫార్చూనర్ కారు అదుపు తప్పి హైవేపై డివైడర్‌కు సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు భారీ వేగంతో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఐదుగురు అందులో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఐదుగురిలో నలుగురు పోలీసులు కాగా ఒకరు ఖైదీగా గుర్తించారు.

ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పబడుతున్న నలుగురు వ్యక్తులు ఢిల్లీ నుంచి ఒక ఖైదీని అరెస్టు చేసి గుజరాత్‌కు తీసుకొస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఖైదీ కూడా మృతి చెందాడు. అయితే కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని ఈ ప్రమాదానికి తెలుస్తోంది. మృతదేహాలను షాపురాలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో గుజరాత్ పోలీసుల భావ్ నగర్‌లోని భరత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ మన్సుఖ్ భాయ్, కానిస్టేబుల్ ఇర్ఫాన్ భాయ్ పఠాన్, కానిస్టేబుల్ భిఖా భాయ్ ముఖేరా, కానిస్టేబుల్ శక్తిసిన్హ్ గోహైల్, సయీమ్ అలియాస్ మున్నా ఉన్నారు. సయీమ్ అలియాస్ మున్నా సలీంపూర్ ఢిల్లీ నివాసి, అతనితో పోలీసులు ఢిల్లీ నుంచి గుజరాత్ వెళ్తున్నారు.

ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. నిందితులను ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తీసుకువెళుతున్న గుజరాత్ పోలీసు వాహనం జైపూర్‌లోని భబ్రూ ప్రాంతంలో ప్రమాదానికి గురికావడం బాధాకరమని, నలుగురు పోలీసులతో సహా 5గురు మరణించారని తన ట్వీట్‌లో వెల్లడించారు. “మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని.. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” తన ట్వీట్ లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: Jwala Gutta: మీ రాజకీయాలు ఆపండి.. హిజాబ్ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల

CM Jagan: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌