Hyderabad: ప్రేమికుల రోజున ఘోరం.. జీడిమెట్లలో బాలిక అనుమానస్పద మృతి..!
Minor Girl Deadbody: ఓ బాలిక అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి కనిపించకుండా పోయిన బాలిక మంగళవారం తెల్లవారుజామున శ..
Hyderabad Crime News: ఓ బాలిక అనుమానస్పద మృతి కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి కనిపించకుండా పోయిన బాలిక మంగళవారం తెల్లవారుజామున శవమైన కనిపించడం సంచలనంగా మారింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల శివారులో చోటు చేసుకుంది. అయితే ఆ యువతిది హత్యనా..? లేక అత్యాచారమా..? ఇంకేదైనా కారణమా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుభాష్‌నగర్‌లో 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోంది. సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులో టెన్షన్‌కు గురై పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా కనిపించలేదు. ఈ రోజు తెల్లవారుజామున జీడిమెట్లలోని పైప్‌లైన్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బాలిక మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది.
దీంతో బాలిక కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికది హత్యనా..? లేక అత్యాచారమా ..?, లేక భవనంపై దూకి ఆత్మహత్మకు పాల్పడిందా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. నిన్న ప్రేమికుల రోజున ఇలా జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే తలకు గాయాలునట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి: