కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తం..!
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివాసం ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Youth Congress Leaders Protest: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నివాసం ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన నివాసాన్ని ముట్టడించారు. భారీగా తరలివచ్చిన నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లడానికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. వందలాదిమంది కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. లఖీంపూర్ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని కేంద్రం కాపాడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
लखीमपुर किसान नरसंहार के आरोपियों को सजा देने की मांग को लेकर युवा कांग्रेस का हल्ला बोल।
#SpeakUpForKisanNyay pic.twitter.com/L73e1menEo
— Youth Congress (@IYC) October 9, 2021