దారుణం.. తల్లి, తండ్రి, చెల్లి, నానమ్మను చంపిన యువకుడు.. కుటుంబ సభ్యులను చంపి మమ్మీలుగా మార్చే యత్నం
దేశంలో దారుణాలు చిత్రవిత్రంగా జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులనే సైతం హత్య చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కనిపెంచిన తల్లిదండ్రులను సైతం..
దేశంలో దారుణాలు చిత్రవిత్రంగా జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యులనే సైతం హత్య చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కనిపెంచిన తల్లిదండ్రులను సైతం అంతమొందిస్తున్నారు. టెక్నాలజీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. కొందరు మాత్రం లేనిపోనివి నమ్మి దారుణాలకు పాల్పడుతున్నారు. తల్లి, తండ్రి, చెల్లి, నానమ్మను చంపాడు 18 ఏళ్ల యువకుడు.. కుటుంబ సభ్యులను చంపి మమ్మీలుగా మార్చే యత్నం చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న మదనపల్లి ఘటన తరహాలో ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. అయితే నాలుగు నెలల తర్వాత ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శవాలతో పాటు భద్రపర్చడానికి వివిధ కెమికల్ బాటిళ్లను పోలీసులు కనుగొన్నారు. అయితే శవపేటికలు తయారు చేయడానికి నిందితుడు ఆన్‌లైన్‌లో ప్లై వుడ్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు టెన్త్ క్లాస్‌లో డిస్టెన్స్ పాస్, హకెర్ అని కూడా తేల్చారు పోలీసులు. బతికుండగానే కాళ్ళు, చేతులు కట్టేసి శవపేటికలో పెట్టి నీళ్లతో నింపి హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే హత్యలు జరిగిన 4 నెలల తర్వాత నిందితుడి అన్న ఈ విషయాన్ని బయటపెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.