మీరు గ్రేట్ తల్లీ.. చనిపోయేముందు రూ. 2 కోట్ల విరాళం ఇచ్చింది
ఈ కాలంలో వయసైపోయి చనిపోవడం కంటే జీవితం మధ్యలోనే అనేక రోగాలు రావడంతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండెపోటు, కేన్సర్, వంటివాటి వల్లే చాలా మంది మృత్యువాత పడుతున్నారు.

ఈ కాలంలో వయసైపోయి చనిపోవడం కంటే జీవితం మధ్యలోనే అనేక రోగాలు వచ్చి ఎక్కువ మంది చనిపోతున్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండెపోటు, కేన్సర్, వంటివాటి వల్లే చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే తమిళనాడులోని ఓ కుటుంబంలో మాత్రం అందరూ కేన్సర్ వల్లే చనిపోయారు. చివరికి ఒంటరిగా మిగిలిన ఓ మహిళ కూడా ఆ వ్యాధి కారణంగానే మృతి చెందింది. కాని ఆమె చనిపోయే ముందు చేసిన సేవను చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని కామరాజ్ పట్టణానికి చెందిన సుందరీ బాయి తన కుటుంబంతో కలిసి ఉండేది. అయితే ఆమె తల్లి, తండ్రి.. అలాగే తన తోబుట్టువలందరూ ఒకరి తర్వాత మరొకరూ కేన్సర్ బారిన పడి మరణించారు. చివరకి ఒంటిరిగా మిగిలిన సుందరీబాయ్ కూడా గత నెల ఫిబ్రవరి 17 న మరణించింది.
చనిపోయే ముందు సుందరీబాయ్ తన మంచి మనుసును చాటుకుంది. అధికారులను ఉద్దేశించి ఓ లేఖ రాసింది. ఒకవేల తాను కేన్సర్ తో చనిపోతే తన పేరిట ఉన్న దాదాపు రూ.2 కోట్ల ఆస్తులను కాంచీపురం అరిజార్ అన్నా కేన్సర్ సెంటర్‌కు అందించాలని కోరింది. అలాగే తన ఇల్లు, 54 సవర్ల బంగారం, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.61 లక్షలు అందజేయండని తెలిపింది. అందులోంచి కొంత మొత్తం తన ఎదురింటివాళ్లకు, ఆటోడ్రైవర్ కు ఇచ్చి బాకీ తీర్చండని వేడుకుంది. అలాగే తాను ఇంట్లో పెంచుకుంటున్న పదికి పైగా ఉన్న పిల్లులను జాగ్రత్తగా కాపాడండని లేఖ ముగించింది. ఆమె కోరిక మేరకు ఆయా ఆస్తులను సీజ్ చేసిన స్థానిక అధికారులు శనివారం వాటి డాక్యుమెంట్లను జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు అందజేశారు. చనిపోయే ముందు కూడా సుందరీబాయ్ తన ఆస్తులను ఇతరులకు దానం చేయడంపై నెటీజన్లు ప్రశంసిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..
