Train Passenger Alert: ట్రైన్ టికెట్ బుక్ చేశాడు.. రూ. లక్ష కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..
కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లు పరిస్థితి మారింది. ప్రపంచలో ఏదో మూలన కూర్చొని డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరాల...

కాదేదీ సైబర్ నేరానికి అనర్హం అన్నట్లు పరిస్థితి మారింది. ప్రపంచలో ఏదో మూలన కూర్చొని డబ్బులు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా ఓ వ్యక్తి ట్రైన్ బుక్ చేయబోయి ఏకంగా రూ. 1.5 కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బోరివలీకి చెందిన ఓ గార్మెంట్స్ డీలర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి అమృత్‌సర్ వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్‌లోనే సుమారు రూ. 20 వేలతో కుటుంబ సభ్యులకు జనవరి 24న ట్రైన్ టికెట్ బుక్ చేశాడు. అయితే టికెట్ కాన్ఫామ్ అయినట్లు ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో ఆందోళన చెందాడు.
మార్చి 6వ తేదీన సీట్ లేఅవుట్ తెలుసుకోవడానికి యాప్‌ను ఓపెన్ చేశాడు. దీంతో కస్టమర్ కేర్ నెంబర్ నెంబర్‌కి కాల్ చేయమాని యాప్‌లో చూపించింది దీంతో కస్టమర్ కేర్ నెంబర్‌కు డయల్ చేయగా.. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌కు కనెక్ట్ అయ్యాడు. కస్టమర్ కేర్ వ్యక్తి సూచన మేరకు కస్టమర్ సపోర్ట్, ఎస్‌ఎమ్‌ఎస్ ఫార్వర్డ్ అనే యాప్‌లను డౌన్‌లోడ్ చేశాడు. అనంతరం యాప్ సూచనల మేరకు డెబిట్ కార్డ్‌ను స్కాన్ చేసి పంపించాడు. ఇలా చేసిన వెంటనే అతని సేవింగ్స్ ఖాతాలో నుంచి రూ. 40 వేలు కోల్పాయాడు. దీంతో మళ్లీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా రీఫండ్‌తో పాటు టికెట్ కన్ఫర్మేషన్ సైతం వస్తుందని హామీ ఇచ్చారు. అయితే రీఫండ్ రాలేదు. దీంతో మరోసారి కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా అదే విధంగా మరో రెండు సార్లు డబ్బులు చెల్లించాడు. ఇలా మూడు సార్లు మొత్తం రూ. 1.15 లక్షలు కోల్పోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..