దేశంలో కలకలం రేపుతున్న ఫ్లూ కేసులు, మహారాష్ట్రలో ముగ్గురు మృతి
దేశంలో ఫ్లూ కేసులు రోజురోజుకు పెరగడం కలకలం రేపుతోంది. దీని కారణంగా మహారాష్ట్రలో శనివారం రోజున ముగ్గురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు తెలిపారు.

దేశంలో ఫ్లూ కేసులు రోజురోజుకు పెరగడం కలకలం రేపుతోంది. దీని కారణంగా మహారాష్ట్రలో శనివారం రోజున ముగ్గురు చనిపోయినట్లు ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు తెలిపారు. దీంతో ఈ ఫ్లూ మరణాల సంఖ్య ఏడుకి ఎగబాకింది. అయితే ఈ ముగ్గురు చనిపోవానికి కారణం ఇన్ ఫ్లూయేంజా-ఏ కి సంబంధించిన H1N1 ఉపరకమా లేక H3N2 ఉపరకమా అని అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే ఫ్లూ వైరస్ ల వల్లే చనిపోయారని అనుమానిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర డెత్ కమిటీ ఈ మరణాలకు గల కారణాన్ని నిర్ధరిస్తుందని పేర్కొన్నారు. అయితే దేశంలో గత ఏడాది డిసెంబర్ నుంచి H3N2 వైరస్ వల్ల ఫ్లూ కేసులు పెరుగుతూనే ఉన్నట్లు కేంద్ర వైద్య అధికారులు తెలిపారు. అలాగే H1N1, అడినోవైరస్, కొవిడ్ వల్ల జ్వరం కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలు, వృద్దులకు ఈ వైరస్ ల ప్రభావావానికి ఎక్కవగా గురవుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది 184 మంది H3N2 వైరస్ సోకగా, సుమారు 405 మంది H1N1 బారిన పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 196 మంది ఫ్లూ వైరస్ లు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఫ్లూ పరీక్షలు చేయించుకోవాలంటే కూడా ఖర్చు ఎక్కువ. అయితే ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 3 లక్షల మంది ఇన్ ఫ్లూయేంజా- ఏ వైరస్ తో బాధపడుతున్నట్లు రాష్ట్ర వైద్యాఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు యాంటీ ఫ్లూ మెడిసన్లు 1,643 మందికి ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..




