AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు జడ్జికి షాక్.. జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ ఆ ప్యాకెట్లను పంపిన మహిళ..!

అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ 150 కండోమ్‌లను న్యాయమూర్తి జస్టిస్ పుష్పా వి గనేడివాలాకు పంపినట్లు పేర్కొంది.

వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు జడ్జికి షాక్.. జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ ఆ ప్యాకెట్లను పంపిన మహిళ..!
Balaraju Goud
|

Updated on: Feb 17, 2021 | 8:13 PM

Share

Woman sends condoms to Justice : పోక్సో కేసులో వివాదాస్పద తీర్పులతో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా గనేడీవాలా ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ తీర్పుకు నిరసనగా అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ 150 కండోమ్‌లను న్యాయమూర్తి జస్టిస్ పుష్పా వి గనేడివాలాకు పంపినట్లు పేర్కొంది.

రాజకీయ విశ్లేషకురాలిగా చెప్పుకుంటున్న దేవ్‌శ్రీ త్రివేది.. జస్టిస్ గణేడివాలా ఛాంబర్‌కు, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రిజిస్ట్రీకి, ముంబైలోని ప్రధాన సీటుతో సహా 12 వేర్వేరు ప్రదేశాలకు కండోమ్ పంపినట్లు తెలిపింది. “నేను అన్యాయాన్ని సహించలేను. జస్టిస్ గనేడీవాలా ఇచ్చిన తీర్పు వల్ల మైనర్ అమ్మాయికి న్యాయం జరగలేదు. జస్టిస్ గనేడివాలాను వెంటనే సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను” అని త్రివేది అన్నారు.

ఫిబ్రవరి 9న ప్యాకెట్లను పంపించానని, వాటిలో కొన్నింటికి డెలివరీ రిపోర్టులు వచ్చాయని త్రివేది తెలిపారు. “ఒక మహిళగా, నేను తప్పు చేశానని నాకు అనిపించదు. నాకు ఎటువంటి అపరాధం లేదు. మహిళలు తమ హక్కుల కోసం నిలబడాలి. జస్టిస్ గనేడివాలా ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరు ఖండించాలని ఆమె డిమాండ్ చేశారు.

అయితే, నాగ్‌పూర్ బెంచ్ రిజిస్ట్రీ కార్యాలయం ఈ తరహా ప్యాకెట్ తమకు అందలేదని తెలిపింది. నాగ్‌పూర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది శ్రీరాంగ్ భండార్కర్ మాట్లాడుతూ.. ఇది స్పష్టమైన కోర్టు ధిక్కార కేసు. ఈ మహిళపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామన్నారు.

ఇదిలావుంటే, దుస్తులపై నుంచి బాలిక ఛాతి భాగాన్ని తడిమితే అది లైంగిక వేధింపుల కిందకు రాదంటూ జనవరి 24న నాగ్‌పూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పుష్పా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తం కాగా.. సుప్రీంకోర్టు దీనిని నిలుపుదల చేసింది. అయితే, మరో కేసులో బాలికల చేతులను పట్టుకోవడం, వారి ముందు ప్యాటు జిప్పు విప్పడం లైంగిక వేధింపుల కిందికి రావని ఆమె తీర్పు ఇచ్చారు. అయితే, ఆమె ఇచ్చిన రెండు వివాదాస్పద తీర్పులతో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది.

కాగా, 2019 ఫిబ్రవరిలో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గనేడివాలాను సుప్రీంకోర్టు కొలీజియం 2021 జనవరిలో శాశ్వత న్యాయమూర్తిగా చేయాలని సిఫారసు చేసింది. అయితే, వివాదాస్పద తీర్పులు వెలుగులోకి వచ్చిన తరువాత, కొలీజియం తన సిఫార్సును ఉపసంహరించుకుంది. గత వారం జస్టిస్ గనేడివాలా అదనపు న్యాయమూర్తిగా ఉన్న పదవీకాలాన్ని ప్రభుత్వం ఒక సంవత్సరానికి పొడిగించింది.

Read Also…  Cricketer Died: క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్.. పుణేలో హృదయ విదారక ఘటన..