AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IB ACIO Exam: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డు, పరీక్ష, ఎంపికపై అభ్యర్థులకు కీలక సూచనలు..

B ACIO Exam: ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అఫీసర్ల పోస్టుల భర్తీకి కేంద్రం హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

IB ACIO Exam: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డు, పరీక్ష, ఎంపికపై అభ్యర్థులకు కీలక సూచనలు..
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2021 | 8:26 PM

Share

IB ACIO Exam: ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అఫీసర్ల పోస్టుల భర్తీకి కేంద్రం హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. త్వరలోనే అడ్మిట్ కార్డు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఐబీ ఏసీఐఓ పోస్టుల భర్తీ ప్రక్రియ, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్, అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే దానిపై కీలక వివరాలు మీకోసం వివరిస్తున్నాము.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల(ఐబీ ఏసీఐఓ) ఎంపిక కోసం అధికారులు మూడు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష(ఆబ్జెక్టీవ్ విధానం), వివరణాత్మక పరీక్ష(డిస్క్రిప్షన్ విధానం), మౌఖిక ఇంటర్వ్యూని నిర్వహిస్తారు. అయితే ప్రతి పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. ఈ అడ్మిట్ కార్డును పరీక్షకు సన్నద్ధమవుతునర్న అభ్యర్థులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, అడ్మిట్ కార్డు విషయంలో అభ్యర్థులు చాలాసార్లు గందరగోళానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు ఇబ్బంది పడకుండా అడ్మిట్ కార్డు అవిషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అభ్యర్థులు సదరు పోస్ట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ వివరాలు వారి మొబైల్‌కు వస్తాయి. ఆ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా ఐబీ ఏసీఐఓ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

2. ఇంకా ఐబీ ఏసీఐఓ అధికారిక సూచనల ప్రకారం.. అభ్యర్థులు అడ్మిట్ కార్డుపై ఉన్న సూచనలను క్షణ్ణంగా పరిశీలించాల్సింది ఉంటుంది. ఈ సూచనల్లో రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఏ సమయానికి రావాలి, ఏమేమి తీసుకురావాలి, వేటికి అనుమతి ఉంది, వేటికి అనుమతి లేదనే పూర్తి వివరాలు అడ్మిట్ కార్డు వెనుకవైపు సూచనల్లో పేర్కొనడం జరుగుతుంది. ఇంకా అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, అది ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏ సంతకం అయితే పెట్టారో.. అడ్మిట్ కార్డుపైనా అదే పెట్టాల్సిఉంటుంది. ఏమాత్రం తేడాగా కనిపించినా దాన్ని పరిగణనలోకి తీసుకోరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. పైగా, పరీక్షకు అనర్హులుగా చేస్తూ బయటకు పంపే అవకాశం ఉంది.

3. పరీక్ష రోజున అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోను వెంట తీసుకెళ్లాలి. అంటే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఫోటో అయితే అప్‌లోడ్ చేశారో అలాంటి ఫోటోనే తీసుకెళ్లాలి. అలాగే ఒరిజినల్ గుర్తింపు కార్డును (ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్) తీసుకెళ్లాలి.

4. ఐబీ ఏసీఐఓ పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. మొదటి విడతలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలో సాధారణ అవగాహన, ఆప్టిట్యూడ్, సంఖ్యా, విశ్లేషణాత్మక, తార్కిక సామర్థ్యం, ఆంగ్ల భాష వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో నెగిటీవ్ మార్కులు కూడా ఉంటాయి. 1/4 వంతున తప్పు సమాధానానికి మార్కులు కట్ చేయడం జరుగుతుంది.

5. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల్లో.. ప్రకటించిన పోస్టుల సంఖ్యకు పది రెట్లు సమానంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అయితే, అభ్యర్థుల ఎంపిక కట్ ఆఫ్‌కు లోబడి ఉంటుంది. ఈ కటాఫ్.. రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో 34 మార్కులు, ఎస్సీలు, వికలాంగులు 33 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

Also read:

వివాదాస్పద తీర్పులిచ్చిన బాంబే హైకోర్టు జడ్జికి షాక్.. జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ ఆ ప్యాకెట్లను పంపిన మహిళ..!

Cricketer Died: క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్.. పుణేలో హృదయ విదారక ఘటన..