JEE Main 2021: ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ పరీక్ష.. అభ్యర్థులు తీసుకుకెళ్ళవలసిన డాక్యుమెంట్లు ఇవే..

జేఈఈ మొదటి సెషన్ మెయిన్ ప‌రీక్ష‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు

JEE Main 2021: ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ పరీక్ష.. అభ్యర్థులు తీసుకుకెళ్ళవలసిన డాక్యుమెంట్లు ఇవే..
JEE Mains 2021
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2021 | 7:21 PM

JEE Main 2021  : జేఈఈ మొదటి సెషన్ మెయిన్ ప‌రీక్ష‌  ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరగనుంది. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి మెయిన్ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు నేషనల్ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ వీలు కల్పించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 6.62 లక్షల మంది హాజరుకానున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచే 1.61 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. జేఈఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఈ కింది డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఏ4 సైజు పేపర్‌పై ముద్రించిన జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు కాపీని త‌ప్ప‌నిస‌రిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రానికి చేరుకునే ముందు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్ నింపాలి. గత 14 రోజులలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోకపోవడం, గొంతు నొప్పి – ముక్కు కారటం లేదా శరీర నొప్పి వంటి లక్షణాలకు సంబంధించిన వివ‌రాలు అందులో తెల‌పాల్సి ఉంటుంది.

అభ్యర్థులు తమ వెంట పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫామ్ లో అప్ లోడ్ చేసిన ఫొటో మనం వెంట తీసుకెళ్లే ఫొటో రెండు సేమ్ ఉండాలి. ఈ ఫొటోను పరీక్ష సమయంలో అటెండెన్స్ షీట్ పై పేస్ట్ చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడి కార్డు తీసుకెళ్లాలి. (పాన్ కార్డ్ – డ్రైవింగ్ లైసెన్స్ – ఓటరు ఐడి – పాస్పోర్ట్ – ఆధార్ కార్డ్ – రేషన్ కార్డ్). ఐడీలు అసలైనవి తీసుకెళ్లాలి.

పీడబ్ల్యూడీ కేట‌గిరీకి చెందిన అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీ చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని ప‌రీక్ష స‌మ‌యంలో చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NIFT: ఎంట్రన్స్ ఎక్సామ్ ఆన్సర్ కీని రిలీజ్ చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ‘కీ’ ని డౌన్ లోడ్ చేసుకొని ఇలా..