AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketer Died: క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్.. పుణేలో హృదయ విదారక ఘటన..

Cricketer Died in Pune: క్రికెట్‌ ఆడుతూ గాయాలపాలవడం సర్వసాధారణం. అలాగే ఆ గాయాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రాణాలు..

Cricketer Died: క్రికెట్ ఆడుతూనే ప్రాణాలు వదిలిన బ్యాట్స్‌మెన్.. పుణేలో హృదయ విదారక ఘటన..
Shiva Prajapati
|

Updated on: Feb 17, 2021 | 7:59 PM

Share

Cricketer Died in Pune: క్రికెట్‌ ఆడుతూ గాయాలపాలవడం సర్వసాధారణం. అలాగే ఆ గాయాల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రాణాలు వదిలిన ఘటనలూ ఉన్నాయి. అయితే తాజాగా పుణేలోని జున్నార్ మండలంలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. నాన్-స్ట్రైక్ వైపు నిలబడి ఉన్న బ్యాట్స్ మెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. నాన్ స్ట్రైకర్‌గా ఉన్న యువకుడు పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో ముందుకు వెళ్లాడు కూడా.

అయితే బంతి కీపర్ చేతిలో పడటంతో వెనక్కి వచ్చాడు. అలా వెనక్కి వచ్చిన అతను అంపైర్‌తో కూడా ముచ్చటించాడు. ఆ తరువాత బ్యాట్ పట్టుకుని మోకాళ్లపై కూర్చున్నాడు. అలా కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఏమైందో అర్థంకాక అందరూ కంగారుపడ్డారు. వెంటనే అతన్ని దగ్గర్లోని వైద్యుని వద్దకు తీసుకువెళ్లగా.. అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. గుండెపోటు కారణంగానే అతను చనిపోయినట్లు తెలిపారు. కాగా, మృతుని పేరు బాబు నలవాడె గా తెలుస్తోంది.

Sportsman Death Video Goes Viral:

Also read:

Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ కోసం గొంతు సవరించనున్న బాలీవుడ్ భామ.. సినిమాలో పాటపాడనున్న అలియాభట్..

బెల్లంకొండ శ్రీనివాస్‏తో జోడీ కట్టనున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తోన్న టీం ?