Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ కోసం గొంతు సవరించనున్న బాలీవుడ్ భామ.. సినిమాలో పాటపాడనున్న అలియాభట్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.  మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Alia Bhatt : 'ఆర్ఆర్ఆర్' కోసం గొంతు సవరించనున్న బాలీవుడ్ భామ.. సినిమాలో పాటపాడనున్న అలియాభట్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 17, 2021 | 7:40 PM

RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్.  మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆరంభం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై ఈ మూవీ పోస్టర్స్ బిజినెస్ కూడా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా చరణ్, గిరిజన వీరుడు కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి కోరిక మేరకు ‘ఆర్ఆర్ఆర్’ కి అలియా ఓ పాట పాడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పాటను అలియాపైనే చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అయితే ఇతర భాషలు కాకుండా ఈ పాట హిందీ వెర్షన్‌ను మాత్రమే ఆలియా పాడనుందట. ఇక అలియా భట్ మంచి సింగర్ కూడా అన్న సంగతి బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే.. గతంలో ఆమె ‘హైవే’, ‘హంటీ శర్మా కీ దుల్హనియా’ వంటి సినిమాలో పాటలు పాడి అలరించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం మరోసారి గొంతు సవరించనుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా అమ్మడి పాట ఎలా ఉంటుందో. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘RRR’ మూవీ థియేట్రిక‌ల్ హక్కులను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!