బెల్లంకొండ శ్రీనివాస్‌తో జోడీ కట్టనున్న బాలీవుడ్ యంగ్ బ్యూటీ.. భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తోన్న టీం ?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో 'ఛత్రపతి' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లను సంప్రదించిన ప్రయోజనం లేకపోయినట్లుగా సమాచారం. తాజాగా ఈ సినిమాలో నటించేందుకు అనన్య పాండేను ఎంపిక చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం అనన్య.. పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ కోసం భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసి.. అనన్యను ఫైనల్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. మరీ అనన్య ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో ? లేదో ? చూడాలి. ఈ సినిమాను పెన్ స్డూడియోస్ రీమేక్ చేస్తుంది. హిందీ వెర్షన్లో కొన్ని మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.
Also Read: