AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నై జల్లికట్టు పోటీల్లో విషాదం.. జనంపైకి దూసుకువచ్చిన ఎద్దు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు

చెన్నై జల్లికట్టు పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పుదుకొట్టై జిల్లా కల్లూరులో బుధవారం జరిగిన పోటీల్లో ఇద్దరు మృతి చెందగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై జల్లికట్టు పోటీల్లో విషాదం.. జనంపైకి దూసుకువచ్చిన ఎద్దు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు
Balaraju Goud
|

Updated on: Feb 17, 2021 | 7:15 PM

Share

Attacked by jallikattu Bull : పోటీల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చెన్నై జల్లికట్టు పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పుదుకొట్టై జిల్లా కల్లూరులో బుధవారం జరిగిన పోటీల్లో ఇద్దరు మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోటీలను చూస్తున్న జనాలపైకి ఎద్దులు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎద్దు దాడిలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముగిసినా.. ఎక్కడో ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. పుదుకొట్టై జిల్లా కట్టూరు సహా దాని చుట్టుపక్కల గ్రామాల్లో జల్లికట్టుతో పాటు రెక్లా రేసులు కూడా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా యువత ఉత్సాహం చూపుతున్నారు. బుధవారం జల్లికట్టు పోటీల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కల్లూరు సమీపంలో బుధవారం జల్లికట్టు, రెక్లా రేసులు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతతో పాటు… ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలిచ్చారు. ఎద్దులు, గుర్రపు బండ్లు గ్రౌండ్‌లో పరుగులు పెడుతున్నాయి. పరుగుతీస్తున్న ఎద్దులను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెదిరిపోయిన ఒక ఎద్దు పోటీలు చూస్తున్న జనంపైకి ఒక్కసారిగా దూసుకువచ్చింది. ఎదురుగా ఉన్నవాళ్లను పదునైన కొమ్ములతో గాయపరుస్తూ.. పరుగులు తీసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎద్దుల దాడిలో గాయపడిన వారిని అరంతంగికి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఎద్దు తమవైపు పరిగెత్తుకు రావడం ముందుగానే పసిగట్టిన పలువురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Read Also…. కోవిడ్ వైరస్ ఎక్కించుకునే వలంటీర్లు ? కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్న బ్రిటన్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్