Delhi: చనిపోయిన తండ్రి బ్రతికొస్తాడని అలా చేసింది.. కట్ చేస్తే చివరికి.. అసలేం జరిగిందంటే!
సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏది నిజమో, ఏది అబద్దమో క్షణాల్లో తెలుసుకునేంతలా ఇంటర్నెట్ ప్రతీ ఒక్కరికీ..
సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏది నిజమో, ఏది అబద్దమో క్షణాల్లో తెలుసుకునేంతలా ఇంటర్నెట్ ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చినా.. ఈరోజుల్లో ఇంకా కొందరు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. అందుకు నిదర్శనంగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
25 ఏళ్ల శ్వేత అనే యువతి తన తండ్రితో కలిసి ఢిల్లీలో నివాసముంటోంది. అక్టోబర్‌లో ఆమె తండ్రికి తీవ్రమైన జబ్బు చేయడంతో ప్రాణాలు విడిచాడు. దీంతో శ్వేత ఒంటరైపోయింది. తండ్రి లేని బాధను జీర్ణించుకోలేకపోయింది. చనిపోయిన వ్యక్తులను బ్రతికించడం అసాధ్యం అని తెలిసినా.. ఎలాగైనా తన తండ్రిని తిరిగి బ్రతికించుకోవాలనే భావనలో కొట్టుమిట్టాడింది. ఈ క్రమంలోనే మగ బిడ్డను నరబలి ఇస్తే.. తండ్రి తిరిగి బ్రతుకుతాడని ఓ తాంత్రికుడు శ్వేతకు చెప్పాడు. దీంతో సదరు యువతి పక్కా ప్రణాళికతో మగబిడ్డ కోసం వెతకడం మొదలుపెట్టింది.
స్థానికంగా ఉన్న సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఓ మహిళ మగబిడ్డకు జన్మనించిందని తెలుసుకుంది. ఆ కుటుంబానికి ఎన్జీఓలో పని చేస్తోన్న మహిళగా దగ్గరైంది. అనంతరం ఆ కుటుంబంతో తరచూ కాంటాక్ట్ అవుతూ.. వారి నమ్మకాన్ని కూడగట్టుకుంది. ఒకానొక సరైన సందర్భం చూసుకుని ఆ మగబిడ్డను కిడ్నాప్ చేసింది శ్వేత. ఇక తమ పసి పిల్లాడు కనిపించకపోవడంతో ఆ కుటుంబం పోలీసులను(గురువారం సాయంత్రం 4 గంటలకు) ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఓ బృందంగా ఏర్పడి పిల్లాడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సరిగ్గా 24 గంటల్లో పిల్లాడిని తల్లి చెంతకు సురక్షితంగా చేర్చారు. శ్వేతను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలికి పోలీసులు అడగ్గా.. శ్వేత అసలు విషయాన్ని మొత్తం చెప్పేసింది.
కాగా, ఈ కిడ్నాప్‌పై డీసీపీ ఇషా పాండే వివరించారు. బాధిత కుటుంబం నమ్మకాన్ని సంపాదించినా శ్వేత.. వాళ్ల ఇంటికి వెళ్లి.. పిల్లాడిని బయటికి తీసుకెళ్లి వస్తానని చెప్పింది. పిల్లాడి తల్లి ఎందుకైనా మంచిదని ఆమె మేనకోడలు రీతూను బాబుతో పంపించింది. శ్వేత తన కారులో వీరిద్దరిని తీసుకెళ్లి.. మార్గం మధ్యలో రీతూకు కూల్ డ్రింక్ ఇచ్చింది. ఆ కూల్ డ్రింక్ తాగాక రీతూ స్పృహ తప్పింది. దీంతో ఆమెను అక్కడే వదిలేసి నిందితురాలు శ్వేత వెళ్లిపోయింది. స్పృహలోకి వచ్చాక రీతూ జరిగిన విషయాన్ని బాధిత కుటుంబానికి చెప్పడంతో అసలు విషయం బయటకొచ్చిందని డీసీపీ స్పష్టం చేసింది.