Police: ఛీ..ఛీ అసలు వీడు పోలీసోడేనా.. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో

బెంగళూరులో అవమానవీయ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఓ పోలీస్ అధికారే లైంగికంగా వేధించడం కలకలం రేపింది.

Police: ఛీ..ఛీ అసలు వీడు పోలీసోడేనా.. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో
Police
Follow us
Aravind B

|

Updated on: Apr 13, 2023 | 8:34 AM

బెంగళూరులో అవమానవీయ ఘటన జరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఓ పోలీస్ అధికారే లైంగికంగా వేధించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తేఓ మహిళ విడాకుల విషయానికి సంబంధించి ఫిర్యాదు చేయడానకి సుద్దగుంటేపాల్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. మొదట ఎస్ఐ మంజునాథస్వామి ఆమెతో బాగానే మాట్లాడాడు. కానీ ఆ తర్వాత తన వక్రబుద్ధని బయటపెట్టాడు. ఆ మహిళ చేయి పట్టుకోవడం, లాగడం లాంటివి చేయడంతో ఆమె అసౌకర్యానికి గురైంది. కానీ ఇబ్బంది పడుతూనే తాను వచ్చిన పని పూర్తి చేసుకుంది.

ఆ తర్వాత ఎస్ఐ ఆమె నెంబర్ అడిగాడు. అతని నెంబర్ కూడా తీసుకొని ఫోన్ చేయాలని అన్నాడు. దీంతో కోపంతో బయటకు వచ్చేసిన ఆ మహిళ ఎస్ఐ పై వేరే చోట ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఎస్ఐ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ సి.కె బాబా తెలిపారు. మహిళల రక్షణే మాకు మొదటి ప్రాధన్యమని.. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం