అమ్మో బాబోయ్..దున్నపోతుని పెంచుకుంటూ నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎక్కడంటే
హర్యాణలో ఉండే దున్నపోతులు చాలా ఫేమస్. కోట్లల్లో విలువ చేసే దున్నలు అక్కడ దొరుకుతాయి. పానీపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు ముర్రజాతి దున్నపోతును పెంచుకొంటున్నాడు.

హర్యాణలో ఉండే దున్నపోతులు చాలా ఫేమస్. కోట్లల్లో విలువ చేసే దున్నలు అక్కడ దొరుకుతాయి. పానీపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్ అనే రైతు ముర్రజాతి దున్నపోతును పెంచుకొంటున్నాడు.దానికి షెహన్‌షా అనే పేరు పెట్టాడు. ప్రస్తుతం దీని వయసు పదేళ్లు. 15 అడుగుల పొడవు..ఆరడగుల ఎత్తుతో ఉంటుంది. కానీ ఈ దున్నపోతు ధర అక్షరాల రూ.25 కోట్లు. వింటేనే షాకింగ్‌గా ఉంది కదా. దీనికి అంతరేటు ఎందుకు ఉందో కారణాలు కూడా ఉన్నాయి.
అయితే ఈ జాతి దున్నల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం నరేంద్రసింగ్ వద్ద ఉంటున్న షెహన్‌బాషా వీర్యాన్ని నెలలో నాలుగుసార్లు బయటకు తీస్తారు. ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారు. దీన్ని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ.300 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత వీటిని మార్కెట్‌లో విక్రయించి నరేంద్రసింగ్ నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నారు. అందుకే ఈ ముర్రాజాతి దున్నలను హర్యాణాలో నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. కర్నాల్ నగరం వీటికి ప్రసిద్ధి. నరేంద్రసింగ్ ఈ దున్న కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కూడా కట్టించారు. వివిధ పోటీల్లోనూ ఈ దున్న విజేతగా నిలుస్తోంది. అయితే ఓసారి నిర్వహించిన ఛాంపియన్‌షిప్ పోటిలో పాల్గొని ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది.




మరిన్ని జాతీయ వార్తల కోసం