Rozgar Mela 2023: ఉద్యోగాల జాతర.. ఇవాళ 71 వేలమందికి నియామక పత్రాలు అందించనున్న ప్రధాని మోడీ

దేశంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం రోజ్‌గార్‌ మేళా. ఈ పథకంలో భాగంగా సుమారు 10 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది.

Rozgar Mela 2023: ఉద్యోగాల జాతర.. ఇవాళ 71 వేలమందికి నియామక పత్రాలు అందించనున్న ప్రధాని మోడీ
Pm Modi
Follow us
Basha Shek

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 13, 2023 | 10:02 AM

దేశంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం రోజ్‌గార్‌ మేళా. ఈ పథకంలో భాగంగా సుమారు 10 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ సర్కార్‌ నిర్ణయించింది. ఇప్పటికే  లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. కాగా రోజ్ గార్ మేళాలో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌13) మరో 71 వేల మందికి జాబ్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వనున్నారు ప్రధాని మోడీ. అనంతరం కొత్తగా ఉద్యోగాల్లో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు .19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 45 ప్రాంతాల్లో వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో రోజ్‌గార్‌ మేళా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమాన్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రైల్వేలో ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ క్లర్క్ తో పాటు మరో 15 పోస్టులకు ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

కాగా రోజ్‌గార్‌ మేళాలో భాగంగా అపాయింట్ లెటర్లు అందుకున్న వారికి ఆన్‌లైన్‌ ఓరియంటేషన్ కోర్సులు ఉంటాయి. జోన్ పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, నాందేడ్ లో కార్యక్రమం జరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ డాక్ సేవక్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టీచర్, డాక్టర్, నర్స్ ఇలా పలు పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..