Crocodile: ప్రాణాలకు తెగించి మొసలి నుంచి భర్తను కాపాడిన భార్య..ఎక్కడ జరిగిందంటే

భార్యభర్తలంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవడం. కష్ట సుఖాలను పంచుకోవడమని తెలిసిందే. కాని ఎటువంటి ప్రమాదకర పరిస్థుతులు ఎదురైన ఒకరినొకరు వదిలివెళ్లకపోవడమే నిజమైన బంధమని నిరూపించింది రాజాస్థాన్ కు చెందిన ఓ మహిళ.

Crocodile: ప్రాణాలకు తెగించి మొసలి నుంచి  భర్తను కాపాడిన భార్య..ఎక్కడ జరిగిందంటే
Banne Singh And Vimal Bai
Follow us
Aravind B

|

Updated on: Apr 13, 2023 | 7:54 AM

భార్యభర్తలంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవడం. కష్ట సుఖాలను పంచుకోవడమని తెలిసిందే. కాని ఎటువంటి ప్రమాదకర పరిస్థుతులు ఎదురైన ఒకరినొకరు వదిలివెళ్లకపోవడమే నిజమైన బంధమని నిరూపించింది రాజాస్థాన్ కు చెందిన ఓ మహిళ. తన భర్తను మొసలి నుంచి ప్రాణాలకు తెగించి కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే..రాజస్థాన్‌లోని కరౌలి జిల్లా మండరాయల్‌ సబ్‌ డివిజనులో బన్నె సింగ్ అనే వ్యక్తి తన భార్య విమల్ బాయి తో కలిసి ఉంటున్నాడు. అయితే వీళ్లకు కొన్ని మేకలు ఉన్నాయి. వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రోజున బన్నె సింగ్ , తన భార్య మేకలకు నీళ్లు తాగించేందుకని చంబల్ నదికి వెళ్లారు. బన్నె సింగ్ కొంత నీటి లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా ఏ మొసలి వచ్చి అతని కాలిని నోట కరిచి.. నీటి లోపలికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.

కాస్త దూరంలో ఉన్న విమల్ బాయి భర్త కేకలు విని పరిగెత్తుకొచ్చింది. తన భర్త కాలును విడిపించేందుకు ధైర్యంగా వెళ్లి ఓ కర్రతో మొసలిని కొట్టింది. అయినా మొసలి కాలిని విడవలేదు. ఇంకా లోపలికి లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. ఇంకాస్త ధైర్యంతో విమల్ బాయి కర్రతో ఆ మొసలి కంట్లో పొడిచింది. దీంతో ఆ మొసలి తన పట్టు తప్పి బన్నె సింగ్ కాలను విడిచిపెట్టింది. ఆ తర్వాత భార్యభర్తలిద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. తన భార్య చేసిన సాహసం ఎన్నడు తీసుకొనటువంటి ఓ గొప్ప బహుమతి అని బన్నె సింగ్ అన్నారు. అలాగే తన భర్తను మొసలి కరచినప్పుడు తన జీవితం గురించి ఆలోచించలేదని.. తన ప్రాణాలు పోయిన కూడా భర్తను ఎలాగైనా కాపాడాలని అనుకున్నానని విమల్ బాయి తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతోమంది విమల్ బాయి చేసిన సాహసంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇవి కూడా చదవండి