వీళ్ళు మనుషులేనా.. మానవ మృగాలా.. నడిరోడ్డుపై మహిళపై అత్యంత పాశవికంగా..!
మహిళ అనే కనికరం ఏమాత్రం లేదు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అమానుషంగా దాడి చేశారు. ఒంటరి మహిళను చేసి ఏకంగా ఆరుగురు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అది కూడా అత్యంత పాశవికంగా తాలిబనీ శైలిలో దాడికి దిగడం గమనార్హం. చుట్టూ ఉన్నవాళ్లు ఈ ఘోరకలిని చూస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరులో.

మహిళ అనే కనికరం ఏమాత్రం లేదు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపైనే అమానుషంగా దాడి చేశారు. ఒంటరి మహిళను చేసి ఏకంగా ఆరుగురు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అది కూడా అత్యంత పాశవికంగా తాలిబనీ శైలిలో దాడికి దిగడం గమనార్హం. చుట్టూ ఉన్నవాళ్లు ఈ ఘోరకలిని చూస్తూ ఉండిపోయారే తప్ప ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరులో. అసలు ఏం జరిగింది.. ఎందుకు ఇలా మహిళపై దాడికి పాల్పడ్డారనే విషయాలపై పూర్తి సమాచారం తెలుసుకుందాం..
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా తవరెకెరె అనే గ్రామంలో ఏప్రిల్ 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నస్రీన్ బాను(38) అనే మహిళపై స్వయంగా ఆమె బంధువులే దాడి చేశారు. దీనికి కారణం.. నస్రీన్ బాను భర్త ఆమెపై అనైతిక సంబంధం ఆరోపణలు చేయడమే..! తన భార్య మరొక వ్యక్తితో అనైతిక సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తూ భర్త రెండు రోజుల క్రితం జామియా మసీదులో ఫిర్యాదు చేశాడు. అతని ఆరోపణ మేరకు మసీదు వారిని విచారణ కోసం పిలిచింది.
కానీ, అంతకు ముందే భర్త, అతని సహచరులు తాలిబానీ శైలిలో అత్యంత అమానుషంగా దాడి చేశారు. తవరెకెరెలోని జామియా మసీదు ముందే ఈ దాడి జరగడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే భర్త ఆరోపణలతో ఆరుగురు దుండగులు ఆ మహిళపై, ఆమె ఇద్దరు బంధువులపై సైతం దాడి చేశారు. చుట్టూ ఉన్నవారు వారిని ఆపకపోగా ఈ దురాగతాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ వీడియో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో చన్నగిరి పోలీస్ స్టేషన్ అధికారులు ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు. మహిళకు అక్రమ సంబంధం ఉందనే భర్త అనుమానమే తప్ప దాడికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పోలీసులు విచారణలో వెల్లడించారు. అయితే.. నడిరోడ్డుపై ఒక మహిళను పట్టుకుని అత్యంత అమానుషంగా దాడి చేయడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమానమే తప్ప నిజానిజాలు తేలకుండా ఈ విధంగా దారుణ రీతిలో దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తప్పు జరిగినా ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరు ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. అన్నింటికీ పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థ ఉన్నాయని.. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్లాలి కానీ, ఇలా మహిళపై అమానుషంగా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులు మహ్మద్ నియాజ్, మహ్మద్ గౌస్ పీర్, చాంద్ పీర్, ఇనాయత్ ఉల్లా, దస్తగీర్, రసూల్ టి.ఆర్ లను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..