Google Map: గూగూల్ మ్యాప్‌తో కేస్ సాల్వ్.. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. ఎక్కడంటే..

Google Map: ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది.. సాంకేతిక పరిజ్ఞానం అంతేస్థాయిలో అభివృద్ధి చెందుతోంది.

Google Map: గూగూల్ మ్యాప్‌తో కేస్ సాల్వ్.. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.. ఎక్కడంటే..
Google Map
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2021 | 5:31 AM

Google Map: ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది.. సాంకేతిక పరిజ్ఞానం అంతేస్థాయిలో అభివృద్ధి చెందుతోంది. అలా అభివృద్ధి చెందిన సాంకేతిక జ్ఞానాన్ని పోలీసులు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో కేసులను త్వరగా తేల్చే స్తున్నారు. తాజాగా నోయిడాలోని తానా జార్చా ప్రాంతంలో గల సాలార్‌పూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని తన కుటుంబ సభ్యులకు గౌతమ్ బుద్ నగర్ పోలీస్ కమిషనరేట్ మానవ-మానవ అక్రమ రవాణా విభాగం (ఎహెచ్‌టియు) బృందం అప్పగించింది. అది కూడా గూగుల్ మ్యాప్ సాయంతో బాలికను ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

గౌతమ్ బుద్ నగర్ పోలీస్ కమిషనరేట్ ఏహెచ్‌టియు ఇన్‌స్పె్క్టర్ దేవేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సెక్టార్ -12 / 22 లో ఉన్న సాయి కృపా షెల్టర్ హోమ్‌లో ఉన్న పిల్లల వద్దకు తమ బృందం వెళ్లింది. ఈ సమయంలో, ఒక అమ్మాయి తన పేరు, తన తండ్రి పేరు చెప్పి, తాను సాలార్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా చెప్పింది. బాలిక ఇచ్చిన సమాచారం ప్రకారం.. పోలీసులు సెర్చింగ్ ప్రారంభించారు. సాలార్పూ్ర్ అనే గ్రామం పోటీస్ స్టేషన్ సెక్టార్ 39 ప్రాంతంలో ఉందని గుర్తించారు. అయితే అక్కడ తనిఖీ చేయగా అమ్మాయికి సంబంధించిన వారెవరూ అక్కడ లేరని తేలింది. ఆ తరువాత పోలీసులు గూగుల్ మ్యాప్ ఆధారంగా సాలార్పూర్ గ్రామాన్ని వెతకగా.. పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో సాలార్‌పూర్ అనే గ్రామం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బాలికకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సాలార్‌పూర్ గ్రామ సర్పంచ్‌కు తెలియజేయగా.. వారు బాలిక తండ్రులకు విషయం చెప్పారు. బాలిక తమ బిడ్డే అని గుర్తించిన తల్లిదండ్రులు.. నోయిడా వెళ్లి ఇంటికి తీసుకువచ్చారు.

Also read:

Viral Video: మనుషులే కాదు.. మేమూ అనుభూతి చెందుతామంటున్న పెంపుడు కుక్క.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ..