Viral Video: మనుషులే కాదు.. మేమూ అనుభూతి చెందుతామంటున్న పెంపుడు కుక్క.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ..

Viral Video: మసాజ్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. మసాజ్ చేయించుకుంటుంటే శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతూ..

Viral Video: మనుషులే కాదు.. మేమూ అనుభూతి చెందుతామంటున్న పెంపుడు కుక్క.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ..
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2021 | 5:15 AM

Viral Video: మసాజ్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. మసాజ్ చేయించుకుంటుంటే శారీరక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతూ.. మనసంతా ప్రశాంతంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తరచుగా మసాజ్ చేయించుకోవడం వలన శరీరంలో రక్త ప్రసరణ మంచిగా జరిగి.. అనారోగ్యం బారిన పడకుండా ఉంటుంది. మనుషులకంటే ఇది ఒకే.. మరి జంతవులకు మసాజ్ చేస్తే అవి ఎలా ఫీల్ అవుతాయో తెలుసా? అయితే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేద్దాం..

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక పెంపుడు కుక్క ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. కుక్కలు మనుషులతో సమానంగా చూసుకోబడుతున్నాయి. యజమానులు సైతం తమ పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యులుగా ట్రీట్ చేస్తున్నారు. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనుషులే కాదు తామూ అనుభూతి చెందుతామంటూ ఓ కుక్క నిరూపించింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఓ కుక్క సోఫాలో కూర్చోగా.. దాని యజమాని చీపురుతో కుక్కకు మసాజ్ చేస్తున్నారు. అలా చీపురుతో మసాజ్ చేస్తున్నంత సేపు.. మసాజ్‌ను అది ఎంజాయ్ చేస్తున్నట్లుగా దాని ముఖకవలికల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చీపురుతో మసాజ్ చేస్తుంటే ఆ కుక్క హాయిగా రిలాక్స్ అవుతోంది. ఇంతకీ ఈ కుక్క పేరేంటో చెప్పలేదు కదా! సోఫాలో దర్జాగా రాజభోగాలు అనుభవిస్తున్న ఈ కుక్క పేరు సోఫీ బోస్. దీనికి ఇన్‌స్టా్గ్రమ్ ఐడీ కూడా ఉంది. దీని బయోలు కూడా రచ్చ రచ్చ చేసేలా ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. నెటిజన్లు ఈ కుక్క రాజసం పట్ల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Sensational revelation : హత్య కేసులో మరో కొత్త కోణం.. అమ్మాయి కోసం హత్య చేశారా..! కారణం అదేనా?

విరాట్ కుమార్తె వామిక నుంచి రోహిత్ కుమార్తె సమైరా వరకు.. ఇంగ్లాండ్‌లో గ్రాండ్ ఫన్ చేస్తున్నారు..

Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు.